TGS RTC | ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. భారీగా పుష్పక్​ బస్సు ఛార్జీల తగ్గింపు..

అక్షరటుడే, హైదరాబాద్:  TGS RTC | భాగ్య నగర ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ తెలిపింది. పుష్పక్​ (Pushpak) బస్సుల (BUS) ఛార్జీలను భారీగా తగ్గించింది. తాజా నిర్ణయంతో హైదరాబాద్​లో ఆయా ప్రాంతాల నుంచి ఎయిర్​పోర్టుకు, ఎయిర్ పోర్టు నుంచి వారి గమ్యస్థానాలకు వెళ్లేవారికి మేలు కలగనుంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (Shamshabad International Airport) మార్గంలో ప్రయాణించేవారికి ఛార్జీల భారం తగ్గనుంది. ఈ మార్గంలో పుష్పక్ బస్సుల్లో ప్రయాణించేవారికి ప్రయాణ ఛార్జీలను రూ. 50 […]

అక్షరటుడే, హైదరాబాద్:  TGS RTC | భాగ్య నగర ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ తెలిపింది. పుష్పక్​ (Pushpak) బస్సుల (BUS) ఛార్జీలను భారీగా తగ్గించింది. తాజా నిర్ణయంతో హైదరాబాద్​లో ఆయా ప్రాంతాల నుంచి ఎయిర్​పోర్టుకు, ఎయిర్ పోర్టు నుంచి వారి గమ్యస్థానాలకు వెళ్లేవారికి మేలు కలగనుంది.

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (Shamshabad International Airport) మార్గంలో ప్రయాణించేవారికి ఛార్జీల భారం తగ్గనుంది. ఈ మార్గంలో పుష్పక్ బస్సుల్లో ప్రయాణించేవారికి ప్రయాణ ఛార్జీలను రూ. 50 నుంచి రూ.100 వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఏఏ మార్గాల్లో ఎంత మేర తగ్గుతున్నాయో వివరాలు వెల్లడించింది.

TGS RTC |  ఆయా మార్గాలను పరిశీలిస్తే..

  • ఎయిర్ పోర్ట్ – శంషాబాద్(Airport- Shamshabad) : పాత ధర రూ. 200 ; కొత్త ధర రూ. 100
  • ఎయిర్ పోర్ట్- మెహదీపట్నం(Airport- Mehdipatnam) : పాత ధర రూ. 350 ; కొత్త ధర రూ. 300
  • ఎయిర్ పోర్ట్- ఆరాంఘర్​ (Airport- Aramghar) : పాత ధర రూ. 250 ; కొత్త ధర రూ. 200
  • ఎయిర్ పోర్ట్- పహాడీషరీఫ్(Airport- Pahadisharif) : పాత ధర రూ. 200 ; కొత్త ధర రూ. 100
  • ఎయిర్ పోర్ట్ ఎల్​బీ నగర్(Airport LB Nagar) : పాత ధర రూ. 350 ; కొత్త ధర రూ. 300
  • ఎయిర్ పోర్ట్- బాలాపూర్(Airport- Balapur) : పాత ధర రూ. 250 ; కొత్త ధర రూ. 200

రాత్రి 10:00 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రస్తుతం ఏవైతే ధరలు ఉన్నాయో.. వాటిల్లోనూ రూ. 50 తగ్గించడం విశేషం.

  • ఎయిర్ పోర్ట్ – జూబ్లీ బస్ స్టేషన్(Airport- Jubilee Bus Station) : పాత ధర రూ. 450 ; కొత్త ధర రూ. 400
  • ఎయిర్ పోర్ట్ – లింగంపల్లి(Airport – Lingampalli) : పాత ధర రూ. 450 ; కొత్త ధర రూ. 400
  • ఎయిర్ పోర్ట్- జేఎన్​టీయూ/మియాపూర్(Airport- JNTU/Miyapur) : పాత ధర రూ. 450 ; కొత్త ధర రూ. 400

Related articles

Kamareddy Chairperson | కామారెడ్డి ఛైర్​పర్సన్​గా ఉమారాణి బాధ్యతల స్వీకరణ.. భారీ బందోబస్తు

కామారెడ్డి మున్సిపల్​ ఛైర్​పర్సన్​గా ఉమారాణి సోమవారం బాధ్యతలు తీసుకోనున్నారు. దీంతో పోలీసులు పట్టణంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Mexico Cartel Violence | డ్రగ్స్​ డాన్​ హతం.. మెక్సికోలో చెలరేగిన హింస

మెక్సికోలో హింస చెలరేగింది. డ్రగ్స్​ వ్యాపారిని పోలీసులు హతమార్చడంతో కార్టెల్స్​ ప్రతీకార దాడులకు దిగారు.

Telangana Cabinet Meeting | నేడు తెలంగాణ కేబినెట్​ భేటీ.. రైతు భరోసాపై ప్రకటన వచ్చేనా

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. రైతు భరోసా, బడ్జెట్ సమావేశాల గురించి చర్చించనున్నారు.

Tirumala Snake Bite | తిరుమల క్యూలైన్‌లో పాము కలకలం.. భక్తురాలిని కాటు వేయ‌డంతో ఐసీయూలో చికిత్స

తిరుమల శ్రీవారి దర్శనానికి వ‌చ్చిన భక్తురాలిని పాము కాటేయడంతో కలకలం రేగింది. టీటీడీ సిబ్బంది వెంటనే స్పందించి అశ్విని ఆసుపత్రికి తరలించగా, అనంతరం స్విమ్స్‌లో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.