Homeభక్తిPuri Jagannath Rath Yatra | పూరీ జ‌గ‌న్నాథ రథయాత్రలో 600 మందికి అస్వస్థత..

Puri Jagannath Rath Yatra | పూరీ జ‌గ‌న్నాథ రథయాత్రలో 600 మందికి అస్వస్థత..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Puri Jagannath Rath Yatra | ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రథయాత్రలో పాల్గొనేందుకు ల‌క్ష‌లాది మంది భ‌క్తులు త‌ర‌లి వ‌చ్చారు. ఇప్పుడు ఆ ప్రాంతం ఇసుకేస్తే రాలనంత జనంగా మారింది. పూరీలోని వీధులు అన్ని కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అయితే భక్తులు అధిక సంఖ్యలో రావడంతో అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. స్వ‌ల్పంగా తోపులాట కూడా జ‌రిగిన‌ట్టు అధికారాలు చెబుతున్నారు. 600 మందికి పైగా అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యార‌ని తెలుస్తోంది. ఒడిశా(Odisha)లోని పూరీ జగన్నాథ ఆలయంలో జరిగిన రథయాత్ర కార్యక్రమం ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా సాగింది. “జై జగన్నాథ” నినాదాలతో నగర వీధులన్నీ మార్మోగాయి. ఈ పవిత్ర ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు లక్షలాది భక్తులు(Devotees) దేశం నలుమూలల నుంచి తరలివచ్చారు.

Puri Jagannath Rath Yatra | స్వ‌ల్ప తొక్కిస‌లాట‌..

అయితే, అధిక ఉష్ణోగ్రత (Temperature), ఉక్కపోత, భారీ రద్దీ కారణంగా 625 మందికి పైగా భక్తులు అస్వస్థతకు గురయ్యారు. వారిని దగ్గరలోని ఆస్పత్రులకు తరలించి వైద్యసేవలు అందించామని అధికారులు తెలిపారు. అందులో చాలామందికి ప్రాథమిక చికిత్స అందించి తిరిగి పంపించామని, ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేశారు. రథాలను లాగేందుకు భక్తులు పోటీపడుతుండడంతో కొంతమంది స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. వారికీ వెంటనే వైద్యసహాయం అందించబడింది. పరిస్థితిని ముందస్తుగా అంచనా వేసిన అధికారులు, భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టంగా చేపట్టారు.

ర‌థ‌యాత్ర‌ సందర్భంగా ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు(Kambhampati Haribabu), సీఎం మోహన్ చరణ్ మాఝీ(CM Mohan Charan Majhi) రథయాత్రలో పాల్గొన్నారు. వారు స్వయంగా జగన్నాథుడు, దేవి సుభద్రా, బలభద్రుని రథాలను లాగుతూ తమ భక్తిని చాటుకున్నారు. ఈ ఏడాది పూరీ జగన్నాథ రథయాత్ర భారీ జనసందోహం, ఎండ కారణంగా కొంత వరకు ఇబ్బంది ఎదురైంది. అయినా కూడా సేవా సిబ్బంది, ప్రభుత్వ యంత్రాంగం చర్యల వల్ల ఎటువంటి అవాంతరాలు లేకుండా కార్యక్రమం సాఫీగా ముగిసింది. అస్వ‌స్థ‌త‌కి గురైన 70 మంది జిల్లా ప్రధాన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలియ‌జేశారు. వీరిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉందని, వారికి ప్రత్యేక వైద్య బృందాలు(Specialized medical teams) చికిత్స అందిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.