ePaper
More
    Homeభక్తిPuri Jagannath Rath Yatra | పూరీలో రథయాత్ర కోసం సిద్ధమవుతున్న ర‌థాలు

    Puri Jagannath Rath Yatra | పూరీలో రథయాత్ర కోసం సిద్ధమవుతున్న ర‌థాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Puri Jagannath Rath Yatra | పూరీలో (Puri) శతాబ్దాలుగా కొనసాగుతున్న జగన్నాథ యాత్ర సంప్రదాయం భారతదేశ జానపద సంస్కృతికి వారసత్వం కాగా, ఈ రథయాత్ర వేదాల నుంచి వచ్చిన ‘లోకాః సమస్తా సుఖినో భవన్తు’ అనే సూత్రాన్ని కూడా స్థాపించింది. అంటే ప్రపంచంలో అందరూ సంతోషంగా ఉండాలి. రథయాత్రలో (Rath Yatra), ప్రతి వ్యక్తికి అతను జగన్నాథ్‌జీ ఆశ్రయానికి వచ్చాననే పరిచయం మాత్రమే మిగిలి ఉంటుంది. ఈ యాత్ర ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలోని శుక్ల పక్షం (Shukla Paksham) రెండో రోజున జరుగుతుంది. ఈ ఏడాది జూన్ 27 నుంచి ప్రారంభం కానుంది. జగన్నాథుని రథాన్ని లాగిన భక్తులు మోక్షాన్ని పొందుతారని ఒక మత విశ్వాసం ఉంది.

    Puri Jagannath Rath Yatra | పోటాపోటీగా..

    జూన్ 27న జరగబోయే భగవాన్ జగన్నాథ రథయాత్ర (Jagannath Rath Yatra) కోసం రథాల నిర్మాణం ఇప్పుడు తుది దశలో ఉంది. కానీ ఈసారి ఆసక్తికరమైన అంశం ఏమిటంటే – మూడు రథాల నిర్మాణాన్ని చేపట్టిన రెండు వేర్వేరు వృత్తిదారుల సమూహాలు, ఎంతో ప్రతిష్ఠాత్మకంగా, ఒకదానికంటే ఒకటి మెరుగైన రథాన్ని తయారుచేయాలనే ఉత్సాహంతో పోటీ పడుతున్నారు. మూడు ర‌థాల‌లో భగవాన్ జగన్నాథుని “నందిఘోష్” రథం మొదటిది కాగా, ఈ రథం 45.6 అడుగుల ఎత్తుతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించబడుతోంది. దీనికి వాడే చెక్క దుంగల సంఖ్య ఏకంగా 742. ఈ రథం బలానికి, భవ్యతకు చిహ్నంగా నిలుస్తోంది. ప్రతి భాగం, ప్రతి చక్క, ఒక నైపుణ్యంతో చెక్కబడుతోంది.

    రెండోది భగవాన్ బలభద్రుని “తాళధ్వజ” రథం. ఇది 45 అడుగుల ఎత్తుతో నిర్మితమవుతోంది. దీనికి 731 చెక్క దుంగలు అవసరమవుతాయి. బలభద్రుని శక్తిని ప్రతిబింబించేలా ఈ రథాన్ని ఘనంగా రూపొందిస్తున్నారు. మూడోది దేవి సుభద్ర యొక్క “దర్పదలన” రథం. 44.6 అడుగుల ఎత్తు గల ఈ రథం 711 చెక్క దుంగలతో నిర్మితమవుతోంది. దీనిపై ప్రత్యేకమైన కళాత్మక శిల్పాలు, రంగులు ఉండేలా చూస్తున్నారు. ఈ రథాల నిర్మాణంలో దాదాపు 200 మంది నిపుణులు అంకితభావంతో పనిచేస్తున్నారు. వడ్రంగులు (carpenters), భోయ్ సేవకులు (helpers), కమ్మర్లు (blacksmiths), చెక్కలు కొట్టే నిపుణులు, టైలర్లు, చిత్రకారులు వీరంతా కూడా భగవంతుడి సేవగా భావించి ర‌థాలు త‌యారు చేస్తున్నారు.

    Latest articles

    Electric shock | వినాయక విగ్రహం తీసుకెళ్తుండగా విద్యుత్ షాక్.. ఒకరి మృతి

    అక్షరటుడే, కామారెడ్డి : Electric shock | వినాయక విగ్రహం తీసుకెళ్తుండగా విషాదం చోటు చేసుకుంది. విగ్రహానికి కరెంట్​...

    Heavy Rains | భారీ వ‌ర్షాలు.. స్తంభించిన ముంబై

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rains | దేశ‌వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. వ‌ర‌ద‌లు పోటెత్త‌డంతో జ‌లాశ‌యాలు నిండుకుండ‌ల్లా...

    KTR | హైదరాబాద్​లో శాంతిభద్రతలు క్షీణించాయి.. కేటీఆర్​ ఆగ్రహం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | హైదరాబాద్​(Hyderabad) నగరంలో శాంతిభద్రతలు క్షీణించాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​...

    India – Russia | భార‌త్‌కు బాస‌ట‌గా ర‌ష్యా.. కీల‌క స‌ర‌ఫ‌రాల పున‌రుద్ధ‌ర‌ణ‌కు హామీ

    అక్షరటుడే, నిజాంసాగర్ : India - Russia | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తెర లేపిన...

    More like this