Homeజిల్లాలునిజామాబాద్​BJP Kisan Morcha | వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి: కిసాన్​ మోర్చా రాష్ట్ర...

BJP Kisan Morcha | వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి: కిసాన్​ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు

రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు రైతులకు సమస్యగా మారాయాని బీజేపీ కిసాన్​ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య ఆరోపించారు. నగరంలో విలేకరులతో మాట్లాడారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు : BJP Kisan Morcha | రాష్ట్రంలో రైతులకు కొనుగోలు కేంద్రాలు సమస్యగా మారాయని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నర్సయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 8 వేలకు పైగా కొనుగోలు కేంద్రాల (Purchasing Centers) అవసరం ఉంటే ఇప్పటివరకు కేవలం 1,492 మాత్రమే ఏర్పాటు చేశారన్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో పంట చేతికి వచ్చిందన్నారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం రైతులకు అండగా నిలవడం లేదన్నారు. పలు జిల్లాల్లో అకాల వర్షాలతో నష్టాలు వాటిల్లితే, మద్దతు ధర ఇవ్వలేదని ఆరోపించారు. చాలా జిల్లాల్లో రైతులు తక్కువ ధరకే ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి నెలకొందన్నారు. రూ.500 బోనస్ కూడా ఒకే పంటకు ఇచ్చిందని గుర్తు చేశారు.

BJP Kisan Morcha | కేంద్ర ప్రభుత్వ నిధులతోనే..

కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ధాన్యాన్ని కొనుగోలు చేస్తారని, రాష్ట్ర ప్రభుత్వం (State Government) కేవలం మధ్యవర్తిత్వం మాత్రమే వహిస్తుందని గుర్తు చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తామే కొంటున్నట్లు రైతులను మభ్యపెడుతుందన్నారు. బీసీ రిజర్వేషన్లపై (BC Reservations) కావాలని రాష్ట్ర ప్రభుత్వం రాద్ధాంతం చేస్తోందన్నారు. సుప్రీంకోర్టులో (Supreme Court) కూడా చుక్కదురైందని, అది ప్రభుత్వానికి ముందే తెలుసన్నారు. మళ్లీ పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు జరుగుతాయని తెలుసుకొని, ఇప్పుడు రైతులను మభ్యపెడుతోందన్నారు. ఇటీవల మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డి మాట్లాడుతూ తాము రూ. 23వేల కోట్లతో ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. నిజానికి అవి కేంద్ర ప్రభుత్వం నిధులని పేర్కొన్నారు. మొక్కల కొనుగోలు కేంద్రాలు కూడా బీజేపీ కిసాన్ మోర్చా (BJP Kisan Morcha) ఒత్తిడితోనే ఏర్పాటు చేశారని తెలిపారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనకర్​ లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, తదితరులు పాల్గొన్నారు.