HomeUncategorizedMinister Ravjot Singh | పంజాబ్ మంత్రి ప్రైవేట్ ఫొటోలు లీక్‌.. రాష్ట్రంలో చెల‌రేగిన రాజ‌కీయ...

Minister Ravjot Singh | పంజాబ్ మంత్రి ప్రైవేట్ ఫొటోలు లీక్‌.. రాష్ట్రంలో చెల‌రేగిన రాజ‌కీయ దుమారం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Minister Ravjot Singh | పంజాబ్ మంత్రి ప్రైవేట్ ఫొటోలు లీక్(Private photos leaked) కావ‌డంతో ఆ రాష్ట్రంలో రాజ‌కీయ దుమారం చెల‌రేగింది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మంత్రి ర‌వ్‌జోత్ సింగ్(Minister Ravjot Singh) ఓ మ‌హిళ‌తో స‌న్నిహితంగా ఉన్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. శిరోమణి అకాలీదళ్‌కు చెందిన బిక్రమ్ సింగ్ మజితియా(Bikram Singh Majithia) ఈ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఫొటోల‌ను వెంట‌నే డిలిట్ చేయాల‌ని మంత్రి రవ్‌జోత్ సింగ్ డిమాండ్ చేయడంతో పంజాబ్‌లో రాజకీయ తుఫాను చెలరేగుతోంది. మజితియా పోస్ట్ చేసిన ఫోటోలు కృత్రిమ మేధస్సుతో రూపొందించబడినవని, అందులో ఆయన మాజీ భార్య ఉన్నట్లు సింగ్ వాదించారు. పోలీసు కేసు నమోదు చేసి, పరువు నష్టం దావా వేస్తానని కూడా మంత్రి చెప్పారు.

Minister Ravjot Singh | చ‌ర్య‌లు తీసుకోవాల్సిందే..

ర‌వ్‌జోత్‌కు చెందిన ప్రైవేట్ ఫొటోల‌ను బిక్ర‌మ్ ఎక్స్‌లో పోస్తూ.. ఆప్ ప్ర‌భుత్వం(AAP government)లోని మంత్రి ర‌వ్‌జోత్ సోదరీమ‌ణుల గౌర‌వానికి భంగం క‌లిగించార‌ని, ప్ర‌భుత్వం వెంట‌నే ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాసుకొచ్చారు. ఈ పోస్టును ఆప్ అధినేత అర్విం ద్ కేజ్రివాల్‌(AAP chief Arvind Kejriwal), పంజాబ్ సీఎం భ‌గవంత్ మాన్‌(Punjab CM Bhagwant Mann)ల‌ను ట్యాగ్ చేశారు. “సోదరీమణుల గౌరవంతో ఆడుకున్న మంత్రి రవ్‌జోత్. ఆప్ పంజాబ్ ప్రభుత్వానికి కొంచెం అయినా సిగ్గు ఉంటే వెంటనే మంత్రి రవ్‌జోత్‌ను తొలగించి, పార్టీ నుంచి బహిష్కరించండి” అని ఆయన Xలో పోస్ట్ చేశారు.

Minister Ravjot Singh | కొట్టిప‌డేసిన ఆప్‌..

అయితే, త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను మంత్రి ర‌వ్‌జోత్ కొట్టిప‌డేశారు. అవి కృత్రిమ మేధ‌తో సృష్టించిన‌వ‌ని శిరోమ‌ణి అకాళీద‌ల్(Shiromani Akali Dal) త‌న‌పై వ్య‌క్తిగ‌తంగా దాడి చేయ‌డ‌మే కాకుండా ఓ మ‌హిళ గౌర‌వాన్ని దెబ్బ తీసింద‌న్నారు. ఎన్నిక‌ల్లో ఓట‌మి భ‌యంతోనే ఇలాంటి ట్రిక్కులకు పాల్ప‌డుతున్నార‌ని ఆరోపించారు. దీనిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తాన‌ని చెప్పారు. మరోవైపు, ఆప్ రాష్ట్ర అధ్య‌క్షుడు చీఫ్ అమన్ అరోరా మంత్రికి మద్దతుగా నిలిచారు. అకాలీదళ్ మురికి రాజకీయాలు ఇంత‌గా దిగజారిపోయారని పేర్కొన్నారు.