IPL 2025 PBKS vs MI Qualifier - 2 Prediction | నేడు పంజాబ్ vs ముంబై ఇండియన్స్ కీలక మ్యాచ్.. ఫ్యాన్స్‌ని క‌ల‌వ‌ర‌పెడుతున్న రికార్డులు
IPL 2025 PBKS vs MI Qualifier - 2 Prediction | నేడు పంజాబ్ vs ముంబై ఇండియన్స్ కీలక మ్యాచ్.. ఫ్యాన్స్‌ని క‌ల‌వ‌ర‌పెడుతున్న రికార్డులు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IPL 2025 PBKS vs MI Qualifier – 2 Prediction : IPL 2025 ఐపీఎల్ 2025 ఫైన‌ల్ ద‌శ‌కు చేరుకుంది. ఈ రోజు పంజాబ్ vs ముంబై ఇండియన్స్(Punjab Kings vs Mumbai Indians) కీలక మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన వారు ఆర్సీబీతో ఫైన‌ల్ మ్యాచ్ ఆడ‌నున్నారు.

రెండు జ‌ట్ల‌కి ఈ మ్యాచ్ కీల‌కం కానుంది. ఆదివారం అహ్మ‌దాబాద్‌(Ahmedabad)లోని న‌రేంద్ర మోదీ స్టేడియం(Narendra Modi Stadium)లో జ‌ర‌గ‌నున్న క్వాలిఫ‌య‌ర్‌-2 (Qualifier 2) మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది. అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు ముంబై క్వాలిఫ‌య‌ర్‌-2 రికార్డులు ఆ జ‌ట్టు అభిమానుల‌ను కాస్త క‌ల‌వ‌రపెడుతున్నాయి. ఈ మ్యాచ్‌ గెలుపు ఇరు జట్లకు కూడా చాలా కీలకమని చెప్పుకోవచ్చు. అయితే నేటి పంజాబ్, ముంబై మధ్య జరిగే మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే, ఏ జట్టు ఫైనల్ చేరుకుంటుందనే ప్రశ్న కూడా తలెత్తుతుంది.

IPL 2025 PBKS vs MI Qualifier – 2 Prediction : ఏది గెలుస్తుంది..

ఐపీఎల్ చ‌రిత్రలో ఇప్ప‌టి వ‌ర‌కు ముంబై ఇండియ‌న్స్ నాలుగు సార్లు క్వాలిఫ‌య‌ర్‌-2 మ్యాచ్‌ల‌ను ఆడింది. ఇందులో రెండు మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది. మ‌రో రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. కాగా.. గెలిచిన రెండు సంద‌ర్భాల్లోనూ ఆ జ‌ట్టు టైటిల్ విజేత‌గా నిల‌వ‌డం విశేషం. ఐపీఎల్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు పంజాబ్‌, ముంబై జ‌ట్టు 32 సంద‌ర్భాల్లో ముఖాముఖిగా త‌ల‌ప‌డ్డాయి. ఇందులో ముంబై Mumbai Indians జ‌ట్టు 17 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించ‌గా, పంజాబ్ 15 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. మ‌రోవైపు క్వాలిఫైయర్ 2 కోసం రిజర్వ్ డేను ఉంచారు. జూన్ 1న వర్షం కారణంగా మ్యాచ్ జరగకపోతే, మ్యాచ్ జూన్ 2న జరుగుతుంది. రిజర్వ్ డే కూడా వర్షం కారణంగా రద్దైతే, ఆ సందర్భంలో మ్యాచ్ రద్దు చేయబడుతుంది.

అలాంటి పరిస్థితుల్లో IPL 2025 పాయింట్ల పట్టికలో ముందున్న జట్టు ఫైనల్‌కు అవకాశం పొందుతుంది. ఆ క్రమంలో పంజాబ్ కింగ్స్‌కు ఆధిక్యం లభిస్తుంది. లీగ్ మ్యాచ్‌ల (league matches) తర్వాత పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానంలో ఉంది. ముంబై నాలుగో స్థానంలో కొనసాగుతోంది. లీగ్ దశలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు 7 వికెట్ల తేడాతో ఓటమిని ఎదుర్కొంది. ఈ క్రమంలో నేటి మ్యాచులో ముంబై జట్టు రివేంజ్ తీర్చుకుంటుందని క్రీడాభిమానులు భావిస్తున్నారు. మరోవైపు విన్ ప్రిడిక్ష‌న్ ప్ర‌కారం ముంబైకే గెలుపు శాతం ఎక్కువ‌గా ఉంద‌ని అంటున్నారు.