Preity Zinta
Preity Zinta | మంచి మ‌న‌సు చాటుకున్న ప్రీతి జింతా.. ఆర్మీకి ఎన్ని కోట్ల విరాళం ఇచ్చిందో తెలుసా?

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Preity Zinta | బాలీవుడ్ న‌టి ప్రీతి జింటా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. న‌టిగా రాణించిన ప్రీతి ఇప్పుడు బిజినెస్‌లో స‌త్తా చాటుతుంది.

పంజాబ్ కింగ్స్(Punjab Kings) సహ యజమానిగా ప్రీతి జింటా ఐపీఎల్‌(IPL)లో సంద‌డి చేస్తుంది. తాజాగా ఆమె గొప్ప మనసును చాటుకుంది. భారత సైన్యం సౌత్ వెస్ట్రన్ కమాండ్ ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (AWWA)కు రూ.1.10 కోట్లు విరాళంగా ఇచ్చింది. పంజాబ్ కింగ్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధి నుంచి ప్రీతి ఈ విరాళాన్ని అందించింది. జైపూర్‌లో జరిగిన విరాళాల కార్యక్రమంలో సౌత్ వెస్ట్రన్ కమాండ్‌కు చెందిన ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్(Army Wives Welfare Association) సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ప్రీతి జింటా కోటి రూపాయల విరాళాన్ని అందజేసి సంతోషాన్ని పంచుకుంది.

Preity Zinta | గొప్ప మ‌న‌సు..

జైపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సౌత్ వెస్ట్రన్ కమాండ్ ఆర్మీ కమాండర్ Army commnader, ప్రాంతీయ అధ్యక్షుడు శప్తా శక్తి, ఆర్మీ కుటుంబాలు హాజరైన సందర్భంగా ఈ విరాళం అందించారు. వీర నారీమ‌ణుల సాధికారిత‌కు, వారి పిల్ల‌ల చ‌దువు కోసం ఈ మొత్తాన్ని వెచ్చించ‌నున్నారు. సైనికులు(Soldiers) చేసిన త్యాగాల‌కు వెల‌క‌ట్ట‌లేమ‌ని, కానీ వారి కుటుంబాల‌కు అండ‌గా ఉందామ‌ని ఈ సంద‌ర్భంగా ప్రీతి జింటా పిలుపునిచ్చారు.

“మన సాయుధ దళాల ధైర్యవంతులైన కుటుంబాలకు ఎంతో కొంత సాయం చేయ‌డం అనేది గౌరవం, బాధ్యత రెండూ. మన సైనికులు చేసిన త్యాగాలను నిజంగా తిరిగి చెల్లించలేం. కానీ మనం వారి కుటుంబాలకు అండగా నిలిచి, వారిని ముందుకు సాగడానికి మద్దతు ఇవ్వగలం. భారతదేశ సాయుధ దళాల పట్ల మేము అపారమైన గర్వాన్ని కలిగి ఉన్నాం. మన దేశం, మన ధైర్యవంతులైన దళాలకు మ‌ద్ద‌తుగా నిలబడతాం” అని ప్రీతి జింటా అన్నారు.

ఈ మహోన్నత విరాళ ప్రదానోత్సవం జైపూర్‌లో ఒక ప్రత్యేక కార్యక్రమంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్మీ కమాండర్ సౌత్ వెస్టర్న్ కమాండ్, రీజినల్ ప్రెసిడెంట్ షప్తా శక్తి ఏడబ్ల్యూడబ్ల్యూఏ AWWA వంటి ఉన్నతాధికారులు, అనేక మంది ఆర్మీ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ప్రీతి జింటా స్వయంగా హాజరై, ఆర్మీ కుటుంబాలతో మాట్లాడారు. వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. సైనికుల త్యాగాలను స్మరించుకొని వారి కుటుంబాలకు తన మద్దతును పునరుద్ఘాటించారు. ఈ విరాళం AWWA చేపడుతున్న వివిధ సంక్షేమ, పునరావాస కార్యక్రమాలకు మరింత బలాన్ని చేకూర్చడంతో పాటు, అనేక మంది వీర నారిలకు, పిల్లలకు ఆసరాగా నిలవనుంది.