అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pune | సంచలనం సృష్టించిన పుణె టెకీ రేప్ కేసు కీలక మలుపు తిరిగింది. అసలు అత్యాచారమే జరగలేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. బాధితురాలే కట్టుకథ అల్లిందని పోలీసులు ఆదివారం వెల్లడించారు. ఫుడ్ డెలీవరీ బాయ్‌గా (food delivery boy) వచ్చిన దుండగుడు తన ఇంట్లోకి వచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడని పుణెకు చెందిన 22 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆమెను విచారించగా పొంతన లేని సమాధానాలు చెప్పింది. దీంతో అనుమానం వచ్చి, సీసీ ఫుటేజ్‌లు (CCTV footage) పరిశీలించగా, ఆమె చెప్పినట్లు అపార్ట్‌మెంట్‌లోకి ఫుడ్ డెలీవరీ బాయ్‌లు ఎవరూ రాలేదని వెల్లడైంది. బాధితురాలు తప్పుడు ఫిర్యాదు చేసిందని, ఉద్దేశపూర్వకంగానే తప్పుదారి పట్టించిందని పోలీసులు తెలిపారు. డెలివరీ ఏజెంట్‌గా నటిస్తూ గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడనే ఆరోపణలతో సహా మహిళ ఆరోపణలన్నీ కల్పితమని పోలీస్ కమిషనర్ అమితేశ్ కుమార్ (Police Commissioner Amitesh Kumar) వెల్లడించారు.
Pune | పొంతన లేని సమాధానాలు..
బాధితురాలు తనపై దాడి జరిగిందని ఇటీవల పోలీసులను ఆశ్రయించింది. కొరియర్ డెలివరీ వ్యక్తిగా వచ్చిన ఓ వ్యక్తి.. తన కొంధ్వా ఫ్లాట్‌లోకి ప్రవేశించాడని ఫిర్యాదులో పేర్కొంది. తలుపు గడియ వేసి, తాను స్పృహ కోల్పోయేలా ఒక రసాయనాన్ని స్ప్రే చేసి, తనపై అత్యాచారం చేశాడని ఆ మహిళ ఆరోపించింది. దుండగుడు తన ఫోన్‌లో సెల్ఫీ తీసుకొని బెదిరించాడని ఆమె పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు (Police registered a case).. అన్ని కోణాల్లో విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఆమె వాంగ్మూలం సేకరించగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఆమెపై అనుమానాలు వచ్చాయి.
Pune | లభ్యం కానీ ఆధారాలు
కెమికల్ స్ప్రే (chemical spray) చేసి తాను స్పృహ కోల్పోయినట్లు చేశాడని బాధితురాలు చెప్పడంతో పోలీసులు నిపుణులను రప్పించారు. వారు వచ్చి ఆధారాల కోసం యత్నించగా ఎలాంటి రసాయన ఆనవాళ్లు లభించలేదు. మరోవైపు, తన ఇంట్లోకి దుండగుడు వచ్చాడని చెప్పడంతో పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లు పరిశీలించగా, కొత్త వ్యక్తులు ఎవరూ రాలేదని తేలింది. దీంతో బాధితురాలిని లోతుగా విచారించగా, అసలు విషయం బయట పడింది. ఎలాంటి అత్యాచారం జరుగలేదని, బాధితురాలు పోలీసులను తప్పుదోవ పట్టించనిందని కమిషనర్ కుమార్ (Police Commissioner Amitesh Kumar) తెలిపారు. మహిళ మానసిక ఆరోగ్యం బాగలేదన్నారు.
1 comment
[…] కోల్‌కతా, బెంగళూరు, కేరళ, పుణెలో Pune రూ. 1,23,700గా నమోదు అయింది. 22 క్యారెట్ల ధర […]
Comments are closed.