HomeజాతీయంPune Road Accident | ఘోర ప్రమాదం.. బ్రేకులు​ ఫెయిలై ఆరు వాహనాలను ఢీకొన్న ట్రక్కు.....

Pune Road Accident | ఘోర ప్రమాదం.. బ్రేకులు​ ఫెయిలై ఆరు వాహనాలను ఢీకొన్న ట్రక్కు.. చెలరేగిన మంటలు.. 8 మంది సజీవ దహనం

Pune Road Accident | మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం పుణెలోని ఓ వంతెనపై సరకులతో వెళ్తున్న ట్రక్కు.. అదుపు తప్పి వరుసగా ఆరు వాహనాలను ఢీ కొంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pune Road Accident | మహారాష్ట్రలోని పుణెలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం (నవంబరు 13) పుణెలోని ఓ వంతెనపై సరకులతో వెళ్తున్న ట్రక్కు.. అదుపు తప్పి వరుసగా ఆరు వాహనాలను ఢీ కొంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ఈ ప్రమాదంలో ఎనిమిది మంది సజీవ దహనం అయ్యారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బెంగళూరు – ముంబయి జాతీయ రహదారి – 4లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Pune Road Accident | బ్రేకులు ఫెయిల్​ కావడం వల్లే ఈ దారుణం..

సరకుల ట్రక్కు బ్రేకులు ఫెయిల్ కావడం వల్ల అదుపు తప్పి ముందు వెళ్తున్న ఆరు వాహనాలను ఢీ కొడుతూ దూసుకెళ్లడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించింది.

ప్రమాద తీవ్ర దృష్ట్యా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. పూర్తిగా ధ్వంసమైన వెహికల్స్​, చెల్లాచెదురుగా పడిఉన్న శరీర భాగాలతో జాతీయ రహదారి బీతావహంగా మారింది.

సతారా నుంచి పుణె వెళ్లే మార్గంలో నవాలే వంతెన సమీపంలోని గవగడ హోటల్ ఎదుట ఈ దారుణం చోటుచేసుకుంది. ప్రమాదం ధాటికి రహదారిపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది.

Must Read
Related News