అక్షరటుడే, వెబ్డెస్క్ : Pune | పూణె సమీపంలోని అంబేగావ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ప్రభుత్వ అధికారి(Government Officer) తన భార్య స్నానం చేస్తున్న సమయంలో రహస్యంగా వీడియోలు తీసి, వాటి ఆధారంగా బ్లాక్‌మెయిల్ చేయడం కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం, 2020లో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు పెళ్లి చేసుకున్నారు. అయితే సదరు వ్యక్తి తన భార్య స్నానం చేస్తున్న సమయంలో రహస్య కెమెరాల(Secret Camera) ద్వారా వీడియోలు తీశాడు. వాటిని బయట పెడతానంటూ బెదిరించి రూ.1.5 లక్షలు తీసుకు రావాలని ఆమెను ఒత్తిడి చేశాడని వెల్లడించారు. ఈ డబ్బును కారు, ఇంటి లోన్లకు ఉపయోగించాలని చూశాడు.
Pune | అంత పని చేశాడా..
తన భర్త నుంచి శారీరకంగా, మానసికంగా వేధింపులు ఎదురవుతున్నాయని, అతని కుటుంబ సభ్యులు కూడా దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని బాధిత మహిళ పోలీసులకు తెలిపింది. ఈ ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు భర్తపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం సాంకేతిక ఆధారాలు, వీడియో ఫుటేజీలు (Video Footage) సేకరిస్తున్నామని, ఆధారాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఇటువంటి చర్యలు మహిళల గౌరవాన్ని అపహాస్యం చేస్తున్నాయని, బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇటీవలి కాలంలో భార్యాభర్తల మధ్య సంబంధాలు ఘోరంగా దెబ్బతింటున్నాయి. చిన్న చిన్న కారణాలకి గొడవలు పడడం, డబ్బుల కోసం భార్యని భర్త చంపితే, వివాహేతర సంబంధాలు పెట్టుకొని భర్తలని కడతేరుస్తున్నారు భార్యలు. రోజు రోజుకి ఇలాంటి సంఘటనలు ఎక్కువైపోతున్నాయి. వీటిని చూసి పెళ్లి కాని వారు తమ జీవితంలోకి కొత్త వ్యక్తిని ఆహ్వానించాలన్నా వణికి పోతున్నారు. పెళ్లంటే ఆమడ దూరం ఉంటున్నారు.