Homeక్రీడలుCheteshwar Pujara | రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన పుజారా.. అన్ని ఫార్మాట్ల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు వెల్ల‌డి

Cheteshwar Pujara | రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన పుజారా.. అన్ని ఫార్మాట్ల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు వెల్ల‌డి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Cheteshwar Pujara | భారత క్రికెట్ జట్టు ఆటగాడు చతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) ఆదివారం రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని రకాల ఫార్మాట్ల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు తెలిపాడు. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్‌లో సుదీర్ఘ లేఖ పోస్టు చేశాడు. “భారత జెర్సీ (India Jersey) ధరించడం, జాతీయ గీతం పాడటం.. నేను మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ నా వంతు ప్రయత్నం చేయడం – దాని నిజమైన అర్థాన్ని మాటల్లో చెప్పడం అసాధ్యం.

కానీ వారు చెప్పినట్లుగా, అన్ని మంచి విషయాలు ముగియాలి. అపారమైన కృతజ్ఞతతో నేను అన్ని రకాల భారత క్రికెట్ (Indian cricket) ఫార్మాట్​ల నుండి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాను. మీ అందరి ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు!” అని పుజారా పోస్ట్‌లో పేర్కొశారు. 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో (World Test Championship final) అతను చివరిసారిగా ఆడాడు. బీసీసీఐ యువ‌కుల‌పై దృష్టి సారించడంతో పుజారా చాలా కాలంగా టెస్ట్‌లలో భారతదేశం తరపున ఆడడం లేదు.

Cheteshwar Pujara | బౌల‌ర్ల స‌హ‌నానికి ప‌రీక్ష‌

2010లో ఆస్ట్రేలియాపై టెస్ట్ అరంగేట్రం చేసిన పుజారా 103 టెస్ట్‌లు ఆడి 43.61 సగటుతో 7,195 పరుగులు చేశాడు. అందులో 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్‌లలో అతని అత్యధిక స్కోరు 206. అతను ఐదు వన్డేల‌లో ఆడి 51 పరుగులు చేశాడు. టెస్టుల్లో త‌న‌దైన ముద్ర వేసుకున్న పుజారా రాహుల్ ద్రావిడ్‌ను (Rahul Dravid) మ‌రిపించాడు. క్రీజులో తన రాక్-సాలిడ్ టెక్నిక్, అద్భుతమైన ఓర్పుకు పేరుగాంచిన పుజారా, సవాలుతో కూడిన విదేశీ పరిస్థితులలో తరచుగా భారత బ్యాటింగ్‌కు వెన్నెముఖ‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లలో ఇండియా సాధించిన చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ విజయాలలో చ‌టేశ్వ‌ర్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాడు.