అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Srilatha Vignesh Yadav | తనకు కార్పొరేటర్‌గా అవకాశమిస్తే ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతామని 36వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిని (Congress Corporator Candidate) జక్కుల శ్రీలత విఘ్నేష్ యాదవ్ అన్నారు. ఈ మేరకు ఆమె డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Srilatha Vignesh Yadav | నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటాం..
ప్రచారంలో భాగంగా ఇంటింటా తిరుగుతూ కాలనీవాసులతో నేరుగా మాట్లాడిన జక్కుల శ్రీలత విఘ్నేష్ యాదవ్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా తాగునీరు, డ్రెయినేజీ, రోడ్లు, వీధి దీపాలు (Streetlights), పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాలపై ప్రజలు వ్యక్తం చేసిన సమస్యలను గమనించి, పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
Srilatha Vignesh Yadav | రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఉన్నందున..
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ఈ పథకాలు ప్రతి అర్హ కుటుంబానికి చేరేలా ప్రజా ప్రతినిధిగా నిరంతరం కృషి చేస్తామన్నారు. అలాగే మహిళలు, యువత, వృద్ధులు, నిరుపేదల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
36వ డివిజన్‌ను..
36వ డివిజన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలబెట్టేందుకు ప్రజల సహకారం అవసరమని జక్కుల శ్రీలత విఘ్నేష్ యాదవ్ అన్నారు. ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే డివిజన్ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉండి అందుబాటులో ఉంటూ సేవ చేస్తానన్నారు. ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు తదితరులు పాల్గొని తమ మద్దతు తెలిపారు.