అక్షరటుడే, వెబ్‌డెస్క్: CP Sajjanar | న్యూ ఇయర్ వేడుకలను హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సచివాలయం వద్ద, చార్మినార్, కేసిఆర్ పార్క్, మెహిదీపట్నం రైతు బజార్ వద్ద కేక్ కట్ చేశారు.
చార్మినార్ (Charminar) వద్ద నిర్వహించిన వేడుకల్లో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనర్ పాల్గొన్నారు. నగర ప్రజలకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. కమిషనర్ మాట్లాడుతూ.. ప్రజల భద్రతే తమ ప్రాధాన్యం అన్నారు. గడిచిన ఏడాదిలో పోలీస్ శాఖ (Police Department)కు సహకరించిన నగర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. 2026లో కూడా శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఇలాగే ఉండాలని కోరారు.
CP Sajjanar | సిబ్బందికి అభినందనలు
పండగలు, వేడుకల సమయంలో కూడా కుటుంబాలకు దూరంగా ఉండి, విధి నిర్వహణలో నిమగ్నమైన పోలీస్ అధికారులను, సిబ్బందిని సీపీ అభినందించారు.హైదరాబాద్ (Hyderabad) నగరాన్ని మరింత సురక్షితమైన, నేరరహిత నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా నగరంలో 10 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించామన్నారు. పోలీసులకు సహకరించిన ప్రజలందరికి ధన్యవాదములు తెలిపారు.
వేడుకలు శాంతియుతంగా జరిగాయని సీపీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. పోలీసుల చర్యలు, ప్రజల మద్దతుతో ఇది సాధ్యమైందన్నారు. హైదరాబాద్‌ను మరింత సురక్షితమైన, ప్రపంచ నగరంగా మార్చడానికి మనమందరం కలిసి పనిచేయడం కొనసాగిద్దామని పేర్కొన్నారు.