అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hydraa | హైడ్రాపై కొంతమంది దుష్ప్రచారాన్ని పలు కాలనీ ప్రజలు అన్నారు. ఈ మేరకు హైడ్రాకు మద్దతుగా బుధవారం నగరంలో ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు చేతపట్టుకుని హైడ్రా జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ (KTR) ఇటీవల హైడ్రా కూల్చివేతలపై ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. హైడ్రాతో పేదలకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో హైడ్రాకు మద్దతుగా ప్రజలు ర్యాలీలు తీయడం గమనార్హం.
మణికొండ (Manikonda) మర్రి చెట్టువద్ద దాదాపు 15 కాలనీల వారు బుధవారం ర్యాలీ నిర్వహించారు. మణికొండ మున్సిపాలిటీలో రూ. వెయ్యి కోట్లకు పైగా విలువైన పార్కులను కాపాడి నగర ప్రజలకు ప్రాణవాయువును అందించారంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. నెక్నాంపూర్ విలేజ్, తిరుమల హిల్స్ నుంచి చిన్నా పెద్ద వచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. ఖాజాగూడ ప్రశాంతి హిల్స్‌లో హైడ్రా కాపాడిన పార్కుల్లో మొక్కలు నాటారు. కొండాపూర్ (Kondapur)లోని రాఘవేంద్ర కాలనీలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కాలనీలో 4300 గజాల ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడారంటూ ర్యాలీ నిర్వహించారు.
Hydraa | లక్షల మందికి న్యాయం
ఒకరిద్దరి స్వార్థ ప్రయోజనాలకోసం వందలమంది నష్టపోవాలా అని ప్రజలు ప్రశ్నించారు. హైడ్రాతో లక్షలాది మందికి న్యాయం జరిగిందంటూ కొనియాడారు. కబ్జాలు చేసి రూ. కోట్లు గడించాలని చూసేవారి ఆటలు ఇక చెల్లవు అని హైడ్రా నిరూపించిందన్నారు. హైడ్రాపై దుష్ప్రచారం తగదని పలువురు ఈ సందర్భంగా హితవు పలికారు.
