ePaper
More
    HomeతెలంగాణMLA Prashanth Reddy | పల్లె దవాఖానాలతో గ్రామీణుల చెంతకే వైద్యం

    MLA Prashanth Reddy | పల్లె దవాఖానాలతో గ్రామీణుల చెంతకే వైద్యం

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్​: MLA Prashanth Reddy | పల్లెల్లో ప్రజలందరికీ వైద్యాన్ని చేరువ చేసేందుకు బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలో పల్లె దవాఖానాలను ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే ప్రశాంత్​ రెడ్డి (MLA Prashanth Reddy) పేర్కొన్నారు. బుధవారం బాల్కొండ నియోజకవర్గంలో రూ. 1.20 కోట్లతో నిర్మించిన మూడు పంచాయతీ భవనాలు, మూడు పల్లె దవాఖానాలను ఆయన ప్రారంభించారు.

    MLA Prashanth Reddy | కేసీఆర్​ ఆలోచనకు ప్రతిరూపం..

    బీఆర్​ఎస్​ ప్రభుత్వ(BRS Government) హయాంలో వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను(Medical Colleges) ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పల్లెల్లో నాణ్యమైన వైద్యం అందాలనే ఆలోచనతో మాజీ సీఎం కేసీఆర్(Former CM KCR)​ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లారని గుర్తు చేశారు. కార్యక్రమంలో బాల్కొండ నియోజకరవర్గ బీఆర్​ఎస్​ నాయకులు పాల్గొన్నారు.

    MLA Prashanth Reddy | పార్టీలో చేరికలు

    మెండోరా మండలం సోన్​పేట్​ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి సమక్షంలో బీఆర్​ఎస్​లో చేరారు. వారికి కండువా కప్పి ఎమ్మెల్యే ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో ఉప సర్పంచ్ చిన్నోళ్ల రమేష్, మాజీ ఎంపీటీసీ మాడుగుల నాగలక్ష్మి, తోపారం హన్మాండ్లు, రాకేష్, ముత్యం, సాగర్, మల్లేష్, ప్రశాంత్, పులి గంగాధర్, రాజన్న, శ్రావణ్, మదన్ తదితరులు ఉన్నారు.

    ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతున్న కార్యకర్తలు

    More like this

    Kaloji Jayanthi | పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కాళోజీ జయంతి వేడుకలు

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Kaloji Jayanthi | నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో కాళోజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు....

    Formula E Race Case | ఫార్మూలా ఈ రేసులో భారీగా అవినీతి.. ఏసీబీ సంచలన నివేదిక

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Formula E Race Case | రాష్ట్రంలో స్థానిక ఎన్నికల (Local Body Elections)...

    Nizamabad City | జెండాగల్లిలో పేకాట..

    అక్షర టుడే, వెబ్ డెస్క్: Nizamabad City | నగరంలోని జెండాగల్లిలో పేకాట స్థావరంపై నాలుగో టౌన్ పోలీసులు...