అక్షరటుడే, ఇందూరు: Collector Ila Tripathi | రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్న తరహాలోనే జిల్లాలోనూ ప్రజావాణి నిర్వహించేందుకు శ్రీకారం చుడతామని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi ) తెలిపారు. ఆన్లైన్లో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి పరిష్కారం దిశగా అడుగులు వేస్తామన్నారు. ఈ మేరకు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ సోమవారం ప్రజావాణిలో (Prajavani) ఫిర్యాదులు స్వీకరించారు.
Collector Ila Tripathi | అధికారులు తప్పక హాజరుకావాలి..
ప్రజావాణికి ఆయా శాఖల అధికారులు తప్పకుండా హాజరుకావాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి అధికారి స్థానికంగానే ఉండాలని కొందరు ఇతర జిల్లాల నుంచి వస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు.
ముందస్తు సమాచారం లేకుండా..
ముందస్తు సమాచారం లేకుండా అధికారులు ప్రజావాణికి గైర్హాజరు కాకూడదని కలెక్టర్ తెలిపారు. సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకంతో ప్రజలు వినతులు అందిస్తారన్నారు. జిల్లా అధికారులు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారాలని చొరవ చూపాలని సూచించారు. అలాగే మండల స్పెషల్ ఆఫీసర్స్‌కు జిల్లా ప్రగతిలో క్రియాశీల పాత్ర ఉంటుందన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఆయా కార్యక్రమాలు పథకాల అమలు తీరును నిశితంగా పరిశీలించాలని సూచించారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో సంబంధిత అధికారులు నిబద్ధతతో పనిచేయాలన్నారు. జిల్లాలో ఎస్ఐఆర్, ఫామ్ 6, ఫామ్ 7 పరిష్కారంలో స్పష్టమైన ప్రగతి లేదన్నారు. కాగా.. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 70 వినతులు అందాయి.