Homeజిల్లాలునిజామాబాద్​Mopal | 17న నీలగిరి చెట్ల బహిరంగ వేలం

Mopal | 17న నీలగిరి చెట్ల బహిరంగ వేలం

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Mopal | జిల్లాలోని మోపాల్​ మండలం ముదక్​పల్లి ప్రభుత్వ బాలుర గిరిజన వసతి గృహంలో ఉన్న 14 నీలగిరి చెట్లను వేలం వేస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి(District Tribal Development) అధికారి నాగోరావు తెలిపారు. అటవీ శాఖ (Forest Department), తహశీల్దార్, వసతి గృహ సంక్షేమ అధికారి (Hostel Welfare Officer), స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీవోల అనుమతితో ఈనెల 17న ఉదయం 11 గంటలకు వేలంపాట ఉంటుందన్నారు. జిల్లాలోని బిల్డర్లు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. చెట్ల నరికివేత సమయంలో ప్రభుత్వ భవనాలకు నష్టం కలగకుండా నిబంధనలను అనుసరించాలని తెలిపారు.