7
అక్షరటుడే, ఎల్లారెడ్డి: Telangana Model School | పట్టణంలోని పీఎంశ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ పాఠశాలలో సోమవారం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఛైర్మన్ పోచవ్వ చేతుల మీదుగా పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్కులు, యూనిఫాం అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ జహంగీర్, ఉపాధ్యాయులు రాజశేఖర్, లక్ష్మణ్ సింగ్, ప్రియదర్శిని, బలవంతరావు, విద్యారమణ, తదితరులు పాల్గొన్నారు.