అక్షరటుడే, ఆర్మూర్: Vinay Reddy | ఆర్మూర్ నియోజకవర్గ (Armoor Constituency) కాంగ్రెస్ ఇన్‌ఛార్జి పొద్దుటూరి వినయ్‌రెడ్డి (Poddaturi Vinay Reddy) సీఎం రేవంత్‌రెడ్డిని (CM Revanth Reddy) మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని (Hyderabad) ఆయనను కలిసి పలు విషయాలపై విన్నపాన్ని అందజేశారు.
Vinay Reddy | రోడ్ల బాగుకోసం..
ఆర్మూర్ నియోజకవర్గంలో ఆర్మూర్ పట్టణ అభివృద్ధికి, ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్ రోడ్లకు (Panchayat Raj Roads) నిధులు మంజూరు చేయాలని ఆయన సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల కొరత కారణంగా రోగులు ఇబ్బందులు పడుతున్నారని.. ఆస్పత్రిలో కావాల్సిన పరికరాలను కేటాయించాలని విన్నవించారు. ప్రత్యేక ఎస్డీఎఫ్ నిధులు రూ. 20 కోట్లు కేటాయించాలని ఆయన సీఎంను కోరారు.