Homeజిల్లాలునిజామాబాద్​Godavari Pushkaralu | గోదావరి పుష్కరాలకు నిధులివ్వండి: ఎంపీ సురేష్‌ రెడ్డి

Godavari Pushkaralu | గోదావరి పుష్కరాలకు నిధులివ్వండి: ఎంపీ సురేష్‌ రెడ్డి

పోచంపాడ్​లో జరగబోయే గోదావరి పుష్కరాల నిర్వహణకు నిధులు ఇవ్వాలని ఎంపీ సురేష్​ రెడ్డి కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్​కు లేఖ రాశారు.

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్​: Godavari Pushkaralu | గోదావరి పుష్కరాలు సమీపిస్తున్నందున ఏర్పాట్లు, అభివృద్ధి పనుల కోసం నిధులు ఇవ్వాలని ఎంపీ సురేష్​రెడ్డి (MP Suresh Reddy) కోరారు. ఈ మేరకు నిధుల కేటాయింపు కోసం కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు (Minister Gajendra Singh Shekhawat) లేఖ రాశారు. ప్రసాద్‌(PRASAD Scheme) (తీర్థయాత్ర పునరుజ్జీవనం, ఆధ్యాత్మిక వృద్ధి డ్రైవ్‌) పథకం కింద నిధుల కేటాయింపు కోసం విన్నవించారు.

Godavari Pushkaralu | వసతులు కల్పించాలి

పుష్కరాలకు లక్షలాది మంది యాత్రికులు, భక్తులు శ్రీరాంసాగర్​కు విచ్చేస్తారని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని శ్రీరామ్​సాగర్‌ ప్రాజెక్ట్‌ (Sriram Sagar Project) (పోచంపాడ్‌) వద్ద మౌలిక సదుపాయాలతో పాటు రాముడు, శివాలయాల అభివృద్ధికి సహకరించాలని లేఖలో కోరారు. తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది యాత్రికులు వచ్చే అవకాశం ఉన్నందునా ప్రసాద్‌ పథకం కింద నిధులు సమకూర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు.