ePaper
More
    HomeతెలంగాణTiranga Rally | ఘనంగా తిరంగా.. మదినిండా దేశభక్తి నిండుగా..

    Tiranga Rally | ఘనంగా తిరంగా.. మదినిండా దేశభక్తి నిండుగా..

    Published on

    అక్షరటుడే, ఇందూరు: నగరంలో త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి.. భారత్ మాతాకీ జై.. నినాదాలు మార్మోగాయి. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన దాడుల్లో విజయం సాధించిన నేపథ్యంలో త్రివిధ దళాలకు సంఘీభావంగా సోమవారం సిటిజన్ ఫోరం (Citizen Forum) ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ (Tiranga Rally) నిర్వహించారు. నగరంలోని ఆర్ఆర్ చౌరస్తాలో (RR Chowrastha) ప్రారంభమైన ర్యాలీ పెద్ద బజార్, ఆజామ్ రోడ్, నెహ్రూ పార్క్ మీదుగా గాంధీ చౌక్ వరకు కొనసాగింది. చిన్నారులు.. మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

    దేశభక్తి పాటలతో కోలాటలాడుతూ ఆకట్టుకున్నారు. దారి పొడవున 50 మీటర్ల భారీ త్రివర్ణ పతాకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో సిటిజన్ ఫోరం కన్వీనర్ కృపాకర్ రెడ్డి(Citizen Forum Convener Kripakar Reddy), ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా(MLA Dhanpal Suryanarayana Gupta), మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ (Former MLA Yendala Lakshminarayana), బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి(BJP District President Dinesh Kulachari), స్వచ్ఛంద సంస్థలు, అడ్వకేట్లు, యువజన, కుల సంఘాలు, క్రీడాకారులు పాల్గొన్నారు.

    ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే ధన్​పాల్​, దినేష్​ కులాచారి, కృపాకర్​రెడ్డి, సీనియర్​ సిటిజన్​ ఫోరం ప్రతినిధులు

    భారీ జాతీయ పతాకాన్ని ఊరేగిస్తున్న నగరవాసులు

    భరతమాత, సైనికుల వేషధారణలో విద్యార్థులు

    ర్యాలీలో పాల్గొన్న మహిళలు

    More like this

    India-Pakistan | మ‌రో నాలుగు రోజుల్లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌.. ఇంకా అమ్ముడుపోని టిక్కెట్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : India-Pakistan | అంతర్జాతీయ క్రికెట్‌(International Cricket)లో హై వోల్టేజ్‌గా పేరొందిన భారత్ vs పాకిస్తాన్...

    Apple iPhone 17 | ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ఐఫోన్ 17 సిరీస్ విడుదల.. అతి సన్నని మొబైల్ ఫీచర్లు, ధర వివ‌రాలు ఇవే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Apple iPhone 17 | టెక్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Apple iPhone...

    High Court | పవన్‌ కల్యాణ్‌ ఫొటోలు పెట్టొద్దు.. హైకోర్ట్‌లో పిల్ దాఖ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Court | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో చట్టబద్ధమైన అనుమతి లేకుండా ఉప ముఖ్యమంత్రి...