Care Degree College | క్రీడాకారిణి సౌమ్య ‘కేర్’ పూర్వ విద్యార్థి కావడం గర్వకారణం
Care Degree College | క్రీడాకారిణి సౌమ్య ‘కేర్’ పూర్వ విద్యార్థి కావడం గర్వకారణం

అక్షరటుడే, ఇందూరు: Care Degree College | కేర్ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థిని అయిన గుగులోత్​ సౌమ్య జాతీయ ఉత్తమ క్రీడాకారిణిగా ఎంపికవ్వడం గర్వకారణమని కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్ (College Director Nara Sudhakar) అన్నారు. సోమవారం ఆమెను కళాశాలలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫుట్​బాల్ (Foot Ball)​ క్రీడలో రాణిస్తూ అవార్డును గెలిచిన తొలి తెలంగాణ క్రీడాకారిణిగా సౌమ్య ఘనత సాధించిందన్నారు.

కోచ్ నాగరాజు (Coach Nagaraju) శిక్షణలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందని గుర్తు చేశారు. ఐడబ్ల్యూఎల్(IWL)​లో ఈస్ట్ బెంగాల్ జట్టు తరఫున 9 గోల్స్​తో ఉత్తమ ప్రతిభ, అలాగే గతేడాది టీమిండియా (Team India)విజయాల్లో కీలకపాత్ర పోషించినందుకు అవార్డు వరించిందని కోచ్ నాగరాజు తెలిపారు. కార్యక్రమంలో తండ్రి గోపి, మాజీ కార్పొరేటర్ సుధీర్, కళాశాల ప్రిన్సిపల్ బాలకృష్ణ, వైస్ ప్రిన్సిపాల్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.