HomeUncategorizedPM Narendra Modi | ఉగ్ర‌వాదానికి వ్య‌తిరేకంగా ఏక‌మైన భార‌త్‌.. సైన్యం స‌త్తాను చూసి గ‌ర్విస్తున్నామ‌న్న...

PM Narendra Modi | ఉగ్ర‌వాదానికి వ్య‌తిరేకంగా ఏక‌మైన భార‌త్‌.. సైన్యం స‌త్తాను చూసి గ‌ర్విస్తున్నామ‌న్న మోదీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: PM Narendra Modi | ఆప‌రేష‌న్ సిందూర్ (Operation sindoor) ద్వారా భార‌త సైన్యం (Indian Army) ప్ర‌ద‌ర్శించిన శౌర్యానికి యావ‌త్ భార‌తావ‌ని గ‌ర్విస్తోంద‌ని ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అన్నారు. ఉగ్ర‌వాదానికి వ్య‌తిరేకంగా భార‌త్ దేశం మొత్తం ఏక‌తాటిపై నిలిచింద‌న్నారు. ఆదివారం మన్ కీ బాత్ 122వ ఎపిసోడ్‌లో (Mann Ki Baat 122 episode) మోదీ మాట్లాడారు. ‘ఆపరేషన్ సిందూర్‌’ ద్వారా పాకిస్తాన్‌లో క‌చ్చితమైన ఆపరేషన్ నిర్వహించిన భారత సైన్యం శౌర్యానికి దేశం గర్విస్తుందన్నారు. “ఆపరేషన్ సిందూర్ సమయంలో మన దళాలు ప్రదర్శించిన ధైర్యం ప్రతి భారతీయుడిని గర్వపడేలా (Every Indian proud) చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదంపై పోరాటానికి ఆపరేషన్ సిందూర్ కొత్త విశ్వాసం, ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) దేశ ప్రజలను ఎంతగానో ప్రభావితం చేసిందంటే, అనేక కుటుంబాలు దానిని తమ జీవితాల్లో భాగంగా చేసుకున్నాయి…” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

PM Narendra Modi | ఇది మ‌న సంక‌ల్పం

ప‌హ‌ల్గామ్ (Pahalgam) ఘ‌ట‌న త‌ర్వాత యావ‌త్ దేశం కోపంతో ర‌గిలిపోయిన‌ప్ప‌టికీ దృఢ నిశ్చ‌యంతో ఉంద‌ని మోదీ అన్నారు. “నేడు, యావత్ దేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా (against terrorism) ఐక్యంగా ఉంది. కోపంతో నిండి ఉంది, కానీ దృఢనిశ్చయంతో ఉంది. ప్రతి భారతీయుడి సంకల్పం ఒక్క‌టే ఉగ్రవాదాన్ని నిర్మూలించడం” అని చెప్పారు. “సరిహద్దు వెంబడి ఉన్న ఉగ్రవాద స్థావరాలను (terrorist camps) మన దళాలు నాశనం చేసేందుకు చేసిన క‌చ్చిత‌త్వ దాడులు అసాధారణమైనవి” అని మోదీ ప్ర‌శంసించారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) కేవలం సైనిక లక్ష్యం కాదు; ఇది మన సంకల్పం, ధైర్యం, పరివర్తన చెందుతున్న భారతదేశానికి నిద‌ర్శ‌నంగా నిలిచింది. ఈ చిత్రం మొత్తం దేశాన్ని దేశభక్తితో నింపింది. దానిని త్రివర్ణ పతాకం రంగుల్లో చిత్రించింది” అని తెలిపారు. “దేశంలోని అనేక నగరాలు, గ్రామాలు, చిన్న పట్టణాలలో తిరంగ యాత్రలు (Tiranga Yatras) నిర్వహించటం మీరు చూసి ఉంటారు. దేశ సాయుధ దళాలకు ద‌క్కిన గౌరవం అది. సైన్యానికి అండ‌గా నిల‌బ‌డేందుకు వేలాది మంది త్రివర్ణ పతాకాల‌ను పట్టుకుని బయటకు వచ్చారు. అనేక నగరాల్లో, పౌర రక్షణ స్వచ్ఛంద సేవకులుగా మారడానికి పెద్ద సంఖ్యలో యువత గుమిగూడారు. చండీగఢ్ నుండి వీడియోలు వైరల్ (Videos Viral) అయ్యాయని మేము చూశామని” చెప్పారు.

PM Narendra Modi | హింస‌కు చ‌ర‌మ‌గీతం..

న‌క్స‌ల్స్‌పై (Naxals) ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించిన అంశాన్ని మోదీ ప‌రోక్షంగా ప్ర‌స్తావించారు. మ‌హారాష్ట్ర‌లోని గడ్చిరోలి జిల్లాలో (Gadchiroli district in Maharashtra) మొదటి బస్సు వచ్చింద‌ని గుర్తు చేశారు. “మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని కటేఝరి గ్రామ ప్రజలు ఈ రోజు కోసం చాలా సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. ఇంతకు ముందు ఇక్కడకు బ‌స్సు ఎప్పుడూ రాలేదు. ఎందుకు? ఎందుకంటే ఈ గ్రామం మావోయిస్టుల (Maoists) హింసకు గురైంది. కానీ ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది. బస్సు మొదటిసారి గ్రామానికి చేరుకున్నప్పుడు ప్రజలు ధోల్-నగర ఆడుతూ దానిని స్వాగతించారని” గుర్తు చేశారు.

PM Narendra Modi | ప్ర‌జ‌ల‌ను ప్ర‌భావితం చేసిన ఆప‌రేష‌న్‌ సిందూర్

ఆపరేషన్ సిందూర్ దేశ ప్రజలను ఎంతగానో ప్రభావితం చేసిందని, అనేక కుటుంబాలు దానిని తమ జీవితాల్లో భాగంగా చేసుకున్నామ‌ని మోదీ (PM modi) తెలిపారు. ఆప‌రేష‌న్ సిందూర్ జ‌రుగుతున్న స‌మ‌యంలో బీహార్‌లోని కతిహార్ (Katihar in Bihar), యూపీలోని కుషినగర్ (Kushinagar in UP), అనేక ఇతర నగరాల్లో జన్మించిన పిల్లలకు ‘సిందూర్’ అని పేరు పెట్టుకున్నార‌ని వివ‌రించారు. “మన సైనికులు ఉగ్రవాద స్థావరాలను నాశనం చేశారు. అది వారి అజేయమైన ధైర్యం, శ‌క్తి సామ‌ర్థ్యాల‌ను చాటి చెప్పింది. భారతదేశంలో (India) తయారైన ఆయుధాలు, పరికరాలు, టెక్నాల‌జీ శక్తితో భార‌త్ త‌న స‌త్తాను చాటింది ” అని మోదీ అన్నారు.