అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ladakh | జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir)లోని లడఖ్‌లో బుధవారం జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. 70 మంది వరకు గాయపడ్డారు.
లడఖ్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాలని యువత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. లేహ్ అపెక్స్ బాడీ (LAB) ఆధ్వర్యంలో లడఖ్‌కు రాష్ట్ర హోదా, ఆరో షెడ్యూల్ పొడిగింపుపై నిరసనలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 10 నుంచి 35 రోజుల నిరాహార దీక్షకు పిలుపునిచ్చింది. సమ్మె సమయంలో 15 మందిలో ఇద్దరు యువకులు అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలైనట్లు సమాచారం. దీంతో బుధవారం నిరసన చేపట్టగా.. అది ఉద్రిక్తంగా మారింది.
Ladakh | బీజేపీ కార్యాలయానికి నిప్పు
లేహ్‌లో యువత చేపట్టిన నిరసన ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులు భాష్పవాయువును ప్రయోగించడంతో పాటు లాఠీఛార్జి చేశారు. లేహ్‌లోని బీజేపీ (BJP) కార్యాలయాన్ని కూడా నిరసనకారులు తగులబెట్టారు. ఈ క్రమంలో చెలరేగిన హింసాలో నలుగురు మృతి చెందారు. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో లడఖ్ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ తన దీక్షను విరమించారు. ఆయన శాంతి కోసం విజ్ఞప్తి చేశారు. మరోవైపు లడఖ్‌లో నిరసనలపై కేంద్ర ప్రభుత్వం బ్యాన్ విధించింది. ఎలాంటి ఆందోళనలకు అనుమతి లేదని హెచ్చరించింది.
హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, లెహ్ అపెక్స్ బాడీ (LAB), కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ (KDA) సభ్యుల మధ్య అక్టోబర్ 6న చర్చలు జరగనున్నాయి. ఈ రెండు సంస్థలు తమ డిమాండ్లకు మద్దతుగా నాలుగు సంవత్సరాలుగా సంయుక్తంగా ఆందోళనకు నాయకత్వం వహిస్తున్నాయి.
Ladakh | ‘కాంగ్రెస్ ప్రమేయం’
లేహ్‌లో జరిగిన హింసాత్మక నిరసనలో కాంగ్రెస్ (Congress) ప్రమేయం ఉందని బీజేపీ ఆరోపించింది. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే బుధవారం ఈ నిరసన వెనుక కాంగ్రెస్ జనరల్ జెడ్ నాయకుడు, పార్టీ నుంచి ఎన్నికైన వార్డు సభ్యుడు ఫుంట్సోగ్ స్టాన్జిన్ త్సెపాగ్ ఉన్నారని ఆరోపించారు. దీనిపై ఆందోళనకు నాయకత్వం వహించిన సోనమ్ వాంగ్‌చుక్ స్పందించారు. కాంగ్రెస్‌కు ఇక్కడ అంత ప్రభావం లేదన్నారు. శాంతియుత నిరసనలు ఎటువంటి ఫలితాలను ఇవ్వకపోవడంతో యువతలో నిరాశ పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.
బీజేపీ నాయకుడు అమిత్ మాల్వియా లడఖ్‌లో కాంగ్రెస్ “అల్లర్లు” చేస్తోందని ఆరోపించారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) అశాంతి గురించి ఊహించినందుకు దాడి చేశారన్నారు. కాగా ఇటీవల దేశంలో సైతం జెన్ జెడ్ యూత్ ఆందోళనలు నిర్వహిస్తారని రాహుల్ గాంధీ పేర్కొన్న విషయం తెలిసిందే.