అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pakistan | పాకిస్తాన్(Pakistan)లో నిరసనలు హింసకు దారి తీశాయి. పాక్‌లోని
సింధ్ ప్రావిన్స్(Sindh Province)లో బుధవారం హింస చెలరేగింది. సింధ్‌లోని నౌషాహ్రో ఫిరోజ్ జిల్లాలోని మోరో నగరంలో ప్రజలు ఆందోళనలు నిర్వహించారు. సింధు నది(Sindhu River)పై ప్రతిపాదిత కాల్వల నిర్మాణానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున నిరసన తెలిపారు. ఈ క్రమంలో సింధ్ హోంమంత్రి జియా ఉల్ హసన్(Sindh Home Minister Zia ul Hassan) ఇంటిపై దాడులు చేశారు. అనంతరం హోంమంత్రి ఇంటిని ఆందోళనకారులు తగులబెట్టారు.
Pakistan | పోలీసుల లాఠీఛార్జి.. ఒకరి మృతి
ఆందోళనకారులను అదుపు చేయడానికి పోలీసులు లాఠీఛార్జి(Police lathicharge) చేశారు. వివాదాస్పద చోలిస్తాన్ ప్రాజెక్టులో భాగంగా కార్పొరేట్ వ్యవసాయం, కాల్వల నిర్మాణాన్ని నిరసిస్తూ అష్ఫాక్ మాలిక్(Ashfaq Malik) నేతృత్వంలోని సింధ్ సభ పార్టీతో అనుబంధంగా ఉన్న కార్యకర్తలు రోడ్డు దిగ్భందించారు. సింధ్‌లోని న్యాయవాదులు చోలిస్తాన్ ప్రాజెక్టును శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రావిన్స్ అంతటా ధర్నా చేశారు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా పలువురు ఆందోళనకారులు గాయపడ్డారు.