అక్షరటుడే, కమ్మర్పల్లి: Kammarpally | బంగ్లాదేశ్లో (Bangladesh) హిందువులపై జరుగుతున్న మరణకాండపై హిందూ ధర్మ పరిరక్షణ సమితి, విశ్వహిందూ పరిషత్ (Vishwa Hindu Parishad) ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ మేరకు కమ్మర్పల్లిలో గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ హిందువులపై (Hindus) ఏ దేశంలో దాడి జరిగినా తీవ్రంగా ఖండిస్తామన్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడిని బంగ్లాదేశ్ ప్రభుత్వం అడ్డుకొని దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. లేదంటే మున్ముందు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు దొంతుల రమణయ్య, వూట్నూర్ రాజశేఖర్, భోగ రామస్వామి, చింత ప్రవీణ్, పోల్కం నవీన్, గుండోజి ప్రభాకర్, చింత నాగరాజు, ఆమెటి నరేందర్, రఘు, నవీన్ గౌడ్, గుండోజి రామదాసు, తీగల రాజన్న తదితరులు పాల్గొన్నారు.