అక్షరటుడే, ధర్పల్లి/ సిరికొండ: Dharpally | సిరికొండ మండలంలోని (Sirikonda mandal) పెద్దవాట్గోట్ శివారులో కబ్జాకు గురవుతున్న చెరువులు, కుంటలను కాపాడాలని సీపీఎం జిల్లా నాయకుడు రమేష్ డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం పార్టీ ఆధ్వర్యంలో తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కొందరు బడా రైతులు ప్రభుత్వ భూములను (government lands) కబ్జా చేయడం వల్ల ఫిర్యాదు చేయడానికి సామాన్యులు భయంతో ముందుకు రావడం లేదని ఆయన తెలిపారు.
కబ్జాదారులు ఎంతటి వారైనా తాము సహించేది లేదన్నారు. ప్రభుత్వ స్థలాలను కాపాడటం కోసం తమ పార్టీ తరపున పోరాడుతామని స్పష్టం చేశారు. వెంటనే అధికారులు రంగంలోకి దిగి కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని ఆయన కోరారు. అలాగే స్థానిక నాయకుడు మోహన్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం కింద పూర్తి వివరాలు సేకరించి కబ్జాల గురించి అధికారులకు వివరించినట్లు తెలిపారు. రెవెన్యూ అధికారులు చొరవ తీసుకొని సరిహద్దులు నిర్ణయించాలని డిమాండ్ చేశారు.
