67
అక్షరటుడే, ఆర్మూర్: Armoor MRPS | ఆర్మూర్ పట్టణంలో ప్రభుత్వ భూములను కాపాడాలని ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మైలారం బాలు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఆర్మూర్ తహశీల్దార్ సత్యనారాయణకు (Armoor Tahsildar Satyanarayana) వినతిపత్రం అందజేశారు.
Armoor MRPS | 202 సర్వే నంబర్లో..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలోని కోటార్మూర్లో (Kotarmur area) 202 సర్వేనంబర్‌లో ప్రభుత్వ భూమి ఉండగా ఓ రియల్టర్ తీగల నర్సారెడ్డి దర్జాగా కబ్జా చేస్తున్నాడని ఆరోపించారు. అందులో కమర్షియల్ డూప్లెక్స్ ఇళ్లు నిర్మిస్తూ వ్యాపారం చేస్తున్నాడన్నారు. వెంటనే ఆ ఇళ్లను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆర్మూర్ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.