అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | పోలీసు శాఖలో పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. పోలీస్ కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన నలుగురు పోలీసులను జిల్లా పోలీస్ కార్యాలయంలో (Kamareddy SP Office) సోమవారం అభినందించి పదోన్నతి చిహ్నాలను అలంకరించారు.
నస్రుల్లాబాద్ (Nasrullabad) కానిస్టేబుల్ బి.వెంకటేశ్వర్లు, తాడ్వాయి (Tadwai) కానిస్టేబుల్ ఎస్.రమేష్ గౌడ్, బీర్కూర్ కానిస్టేబుల్ జి.శ్రీనివాస్‌లకు పదోన్నతి రాగా డి.దామోదర్ రాజన్న సిరిసిల్ల(Rajanna Sirisilla) జిల్లా నుండి కామారెడ్డికి వచ్చారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పదోన్నతులు పొందిన సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవలు అందించాలన్నారు. క్రమశిక్షణతో, నిబద్ధతతో విధులు నిర్వర్తించే ప్రతి ఒక్కరికీ పోలీసు శాఖలో తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుందని తెలిపారు. ప్రజాసేవలో నిజాయితీగా పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు దక్కుతుందని, సీనియారిటీ ప్రకారం అందరికీ ప్రమోషన్లు లభిస్తాయని తెలిపారు.