SP Rajesh Chandra
SP Rajesh Chandra | పదోన్నతులు బాధ్యతను పెంచుతాయి

అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | పోలీసులకు పదోన్నతులు బాధ్యతలు పెంచుతాయని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర kamareddy SP Rajesh chandra అన్నారు. ఏఎస్సై నుండి ఎస్సైలుగా పదోన్నతి పొందిన 11 మంది పోలీసులను అభినందిస్తూ పదోన్నతి స్టార్ ను తొడిగారు.

రామారెడ్డి పోలీస్టేషన్ (Ramareddy police station) ఏఎస్సై లచ్చీరాం, ఎల్లారెడ్డి ఏఎస్సై, ఎండీ సిద్ధిక్​, భిక్కనూరు ఏఎస్సై మల్లారెడ్డి, పెద్దకొడపగల్ ఏఎస్సై రాములు, మాచారెడ్డి ఏఎస్సై నర్సింలు, గాంధారి ఏఎస్సై గణేష్, పిట్లం ఏఎస్సై, లింబాద్రి, నాగిరెడ్డిపేట్ (Nagireddypet) ఏఎస్సై ఉమేష్, దోమకొండ సుబ్రమణ్య చారి తాడ్వాయి ఏఎస్సై సంజీవ్, హన్మగౌడ్(ఇంటలిజెన్స్) ఎస్సైలుగా పదోన్నతి పొందిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు మదన్ లాల్, యాకుబ్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్​స్పెక్టర్​ తిరుపతయ్య, రిజర్వు ఇన్​స్పెక్టర్లు సంతోష్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.