అక్షరటుడే, కామారెడ్డి: Sp Rajesh Chandra | పదోన్నతులు పోలీసులకు మరింత బాధ్యతను పెంచుతాయని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. ఏఎస్సై నుంచి ఎల్లారెడ్డి ఎస్సైగా (Yellareddy SI) పదోన్నతి పొందిన నరేందర్.. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో (District Police Office) ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా పదోన్నతి పొందిన నరేందర్‌కు ఎస్పీ పదోన్నతి చిహ్నాన్ని అలంకరించి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పదోన్నతి ద్వారా పోలీసులకు గుర్తింపుతో పాటు విధులపట్ల ఉత్సాహం ఉంటుందన్నారు. పదోన్నతులు పొందిన పోలీస్ సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవలందించాలని కోరారు. పోలీసుశాఖలో క్రమశిక్షణతో పాటు నిబద్ధతతో బాధ్యతలు నిర్వహించే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, గౌరవ మర్యాదలు లభిస్తాయని ఆయన చెప్పారు.