అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IAS Promotions | ఆలిండియా సర్వీసెస్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ కేడర్‌కు చెందిన పలువురికి ప్రమోషన్ ఇచ్చింది.
తెలంగాణ కేడర్‌కు చెందిన 1996 బ్యాచ్ ఐఏఎస్ అధికారులకు (IAS Officers)ఐఏఎస్ అపెక్స్ స్కేల్ (లెవెల్-17)కు పదోన్నతి పొందారు. నవీన్ మిట్టల్, దాన కిషోర్ పదోన్నతి పొందిన వారిలో ఉన్నారు. కాగా పదోన్నతి తర్వాత సైతం వారు ప్రస్తుతం ఉన్న పోస్టుల్లోనే పని చేస్తారు. 2001, 2017 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు సైతం పదోన్నతులు కల్పిస్తూ సీఎస్ రామకృష్ణారావు (CS Ramakrishna Rao) ఉత్తర్వులు జారీ చేశారు.
IAS Promotions | 2017 బ్యాచ్ ఐఏఎస్‌లు
రాష్ట్ర కేడర్‌లో పని చేస్తున్న 2017 బ్యాచ్‌కు చెందిన పలువురు ఐఏఎస్‌లకు ప్రభుత్వం జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ స్కేల్ (లెవెల్–12)గా ప్రమోషన్ ఇచ్చింది. పదోన్నతి పొందిన వారిలో ఐఏఎస్ అధికారులు రిజ్వాన్ బాషా షేక్, మను చౌదరి, ముజామిల్ ఖాన్, వెంకటేశ్ ధోత్రే, సంతోష్ బీఎం, రాజర్షీ షా, ప్రతీక్ జైన్, ఇలా త్రిపాఠి, స్నేహ శబరీష్, రాహుల్ శర్మ, దివాకర టీఎస్, కోట శ్రీవాత్సవ, కాత్యాయనీ దేవి, నర్సింహారెడ్డి ఉన్నారు. ప్రమోషన్ పొందినప్పటికి సదరు ఐఏఎస్ అధికారులు ప్రస్తుతం ఉన్న పోస్టుల్లో కొనసాగనున్నారు.పలువురు ఐపీఎస్ అధికారులు (IPS Officers) సైతం పదోన్నతి పొందారు. 2001 బ్యాచ్‌కు చెందిన అకున్ సభర్వాల్, సుధీర్ బాబు లెవెల్ 15కు ప్రమోషన్ పొందారు.