అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai chaitanya | పోలీస్‌శాఖలో పదోన్నతులు బాధ్యతను పెంచుతాయని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పీసీలు హెచ్‌సీలుగా ప్రమోషన్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ కానిస్టేబుళ్లు సోమవారం సీపీ సాయిచైతన్యను కలిశారు.

CP Sai chaitanya | పదోన్నతులు బాధ్యతను పెంచుతాయి: సీపీ సాయిచైతన్య
ఈ సందర్భంగా ప్రమోషన్ పొందిన హెడ్ కానిస్టేబుళ్లను సీపీ తన కార్యాలయంలో (Nizamabad Cp office) అభినందించారు. అనంతరం సీపీ మాట్లాడుతు పదోన్నతులు పొందిన కానిస్టేబుళ్లు మరింత బాధ్యతతో పనిచేయాలని సూచించారు.
CP Sai chaitanya | పదోన్నతుల వివరాలివే..
ప్రమోషన్ పొందిన వారిలో ఏ.లింబాద్రి, రెంజల్ (Renjal) పీఎస్, కె.చిన్నయ్య (కోటగిరి), పి.గణేష్ (నిజామాబాద్ రూరల్), కె.యాదవ్ (మాక్లూర్), ఏ.వరప్రసాద్ (కమ్మర్పల్లి), ఎండీ ఆరీఫుద్దీన్ (టౌన్–2), సీహెచ్.శేఖర్ (నిజామాబాద్ పీసీఆర్), డి.శ్రీనివాస్ రావు (నవీపేట్), జి.శ్రీనివాస్ (భీమ్‌గల్), రాంచందర్ (ఇంటిలిజెన్స్ ఓడీ) ఉన్నారు. వీరందరిని పదోన్నతిపై జగిత్యాల జిల్లాకు పంపించారు.