అక్షరటుడే, హైదరాబాద్: Promotion schedule : రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల(government teachers) కు తెలంగాణ ప్రభుత్వం (Telangana government) గుడ్ న్యూస్ చెప్పింది. వీరి ప్రమోషన్ల షెడ్యూల్‌ను తాజాగా విద్యాశాఖ (Education Department) విడుదల చేసింది. దీని ప్రకారం ప్రమోషన్ల ప్రక్రియ ఆగస్టు 2 నుంచి కొనసాగనుంది. ఆగస్టు 11లోగా ప్రక్రియ పూర్తి చేయనుంది.
ప్రభుత్వ ఉపాధ్యాయుల ప్రమోషన్ల (promotions) ప్రక్రియ మొత్తం 10 రోజుల్లో పూర్తి కానుంది. గత నెల (జూన్ 30) వరకు ఖాళీ అయిన స్థానాలను ప్రమోషన్లతో భర్తీ చేయనున్నారు. అయితే, దీనికి ముందే బదిలీ ప్రక్రియ చేపట్టాల్సి ఉండగా.. పాఠశాలలు మొదలు కావడంతో ఈ నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
Promotion schedule : పదోన్నతులు ఎందరికంటే..
తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3,900 మంది టీచర్లకు పదోన్నతులు లభించనున్నాయి. రాష్ట్రంలో 900 వరకు ప్రధానోపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 9 వందల మంది స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెడ్ మాస్టర్లు(gazetted head masters)గా పదోన్నతి లభించనుంది.
Promotion schedule : జోన్ల వారీగా..
జోన్ల వారీగా పరిశీలిస్తే.. మల్టీజోన్-1లో 492, మల్టీజోన్-2లో 411 ప్రధానోపాధ్యాయుల పోస్టులు ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలలో తీసుకుంటే.. ఇందులో హెడ్ మాస్టర్ పోస్టులు 641వరకు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని ఎస్జీటీల ద్వారా భర్తీ చేయనున్నారు. ఇక ప్రమోషన్ల వల్ల స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ అవుతాయి.. వీటిని ఎస్జీటీలతో భర్తీ చేయనున్నారు. కాగా, లాంగ్వేజ్ పండితులు, పీఈటీ(PET)లకు కూడా ప్రమోషన్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది.