అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Air Craft | రక్షణ రంగంలో స్వదేశీ తయారీని ప్రోత్సహించే దిశగా రక్షణ శాఖ(Defense Department) అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కీలక ప్రకటన చేసింది.
భారత వైమానిక దళం కోసం ఫిఫ్త్ జనరేషన్ డీప్ పెనెట్రేషన్ అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA)ను స్వదేశీంగా అభివృద్ధి చేయడానికి ఒక మెగా ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపింది. ఈ మేరకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Minister Rajnath Singh) “ఎగ్జిక్యూషన్ మోడల్”కు తాజాగా ఆమోదం తెలిపారు. భారతదేశ తన వైమానిక శక్తి సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి అధునాతన స్టెల్త్ లక్షణాలతో మీడియం వెయిట్ డీప్ పెనెట్రేషన్ ఫైటర్ జెట్‌ను అభివృద్ధి చేయడానికి ప్రతిష్టాత్మకమైన AMCA ప్రాజెక్ట్‌పై పని చేస్తోంది. ఇతర సంస్థల భాగస్వామ్యంతో బెంగళూరులోని డీఆర్‌డీవో-ఏరోనాఇకల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఏడీఏ) దీనిని అమలు చేయనుంది.
Air Craft | ఫిఫ్త్ జెనరేషన్ ఎయిర్‌క్రాఫ్ట్
AMCA ఐదో తరగతం అధునాతన ఎయిర్‌క్రాఫ్ట్‌గా రూపుదిద్దుకోనుంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అడ్వాన్స్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ నమూనాను తొలిసారి ఏరో ఇండియా-2025లో ఆవిష్కరించారు. అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మోడల్‌ను రక్షణశాఖ మంత్రి ఆమోదించారని ఆ మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది.
“భారతదేశ స్వదేశీ రక్షణ సామర్థ్యాలను పెంపొందించడానికి, బలమైన దేశీయ ఏరోస్పేస్ పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను పెంపొందించడానికి గణనీయమైన ప్రయత్నంలో, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మోడల్‌ను ఆమోదించారు” అని ఓ ప్రకటనలో తెలిపింది.”ఎగ్జిక్యూషన్ మోడల్” విధానం ప్రైవేట్, ప్రభుత్వ రంగాలకు పోటీ ప్రాతిపదికన సమాన అవకాశాలను అందిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
Air Craft | ముఖ్యమైన అడుగు..
ఏరోస్పేస్ రంగంలో ఆత్మనిర్భర్భ (స్వయం సమృద్ధి) దిశగా ఒక ప్రధాన మైలురాయిగా ఉండే AMCA ప్రోటోటైప్‌ను అభివృద్ధి చేయడానికి స్వదేశీ నైపుణ్యం, సామర్థ్యాన్ని ఉపయోగించుకునే దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగు” అని రక్షణ శాఖ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) నేతృత్వంలోని భద్రతపై క్యాబినెట్ కమిటీ గత సంవత్సరం ఫైటర్ జెట్ కార్యక్రమానికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.
ఈ ప్రాజెక్ట్ ప్రారంభ అభివృద్ధి వ్యయం సుమారు రూ. 15,000 కోట్లుగా అంచనా వేశారు. లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్(Light Combat Aircraft) (LCA) తేజస్ అభివృద్ధి తర్వాత AMCA అభివృద్ధిపై భారతదేశం విశ్వాసం గణనీయంగా పెరిగింది. కృత్రిమ మేధ ఆధారిత ఎలక్ట్రానిక్ పైలట్, నెట్ ఆధారిత ఆయుధ వ్యవస్థలు వంటి ప్రత్యేకతలు ఈ విమానం సొంతం. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సమర్థంగా సత్తా చాటుతుంది. 25 టన్నుల బరువుండే ఈ ఎయిర్‌క్రాఫ్ట్(Air Craft)ను మావన సహితంగా, మానవ రహితంగా పని చేసేలా రూపొందించనున్నారు. దీని డిజైన్‌ను ఏడీఏ రూపొందించగా, హైదరాబాద్‌కు చెందిన వేమ్ టెక్నాలజీస్ ఫ్యాబ్రికేషన్ పనులు చేసింది.