అక్షరటుడే, కామారెడ్డి: BJP Kisan Morcha | కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో నెరవేర్చాలని బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు (BJP Kisan Morcha district) డిమాండ్ చేశారు. భారతీయ కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు మాట్లాడుతూ.. రుణమాఫీ కాని రైతులకు రూ.2లక్షల వరకు మాఫీని వెంటనే అమలు చేయాలన్నారు. వరిధాన్యం, మొక్కజొన్న, కందులు, సోయాబీన్స్, పత్తి, మిర్చి, పసుపు, ఎర్రజొన్న, చెరుకు పంటలకు రూ.500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులకు ప్రతి ఎకరానికి రూ. 15వేలు రైతు భరోసా చెల్లిచాలన్నారు. రాష్ట్రంలో పీఎం ఫసల్ బీమాను (PM FASAl BIMA) అమలు చేయాలని కోరారు.
నకిలీ విత్తనాలు (fake seeds) విక్రయించే వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రతి జిల్లాలో ఒక విజిలెన్స్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని, సబ్సిడీపై రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలను అందించాలని డిమాండ్ చేశారు. అలాగే పండ్ల తోటల రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా నాయకులు గంగారెడ్డి, మహిపాల్ రెడ్డి, జైపాల్ రెడ్డి, బీజేపీ నాయకులు నరేందర్ రెడ్డి, లింగారావు, రవీందర్, రాజ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.