అక్షరటుడే, డిచ్పల్లి/ఎల్లారెడ్డి: Panchayat Elections | రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ ఉమ్మడి జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతోంది. ప్రజలు చలిని (cold weather) సైతం లెక్కచేయకుండా క్యూలైన్లలో నిలబడి ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు.
Panchayat Elections | ఓటేసిన దినేష్ కులాచారి..
బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (Dinesh Kulachari) తన సొంతగ్రామమైన అమృతపూర్లో ఆదివారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వగ్రామంలో ఓటు వేయడం ఆనందంగా ఉందన్నారు. గ్రామానికి సేవచేసే వారికి నా మద్దతు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
Panchayat Elections | నల్లమడుగు సురేందర్ దంపతులు..
లింగంపేట మండలంలోని నల్లమడుగులో మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ (Former MLA Nallamudugu Surender) దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు, పోలీసులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు.