6
అక్షరటుడే, ఇందూరు: TSRJC CET | రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ప్రవేశాల నిమిత్తం ఈనెల 10న జరుగనున్న కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కు పోలీసుశాఖ (Police Department) కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా పరీక్ష జరిగే రోజు కమిషనరేట్ పరిధిలో (Commissionerate area) అండర్ సెక్షన్–163 బీఎన్ఎస్ అమల్లో ఉంటుందని సీపీ సాయిచైతన్య(CP Sai Chaitanya) తెలిపారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పరీక్షా కేంద్రాల వద్ద ఉండవద్దని హెచ్చరించారు. కేంద్రాల పరిసర ప్రాంతాల్లో అన్ని జిరాక్స్ సెంటర్లను ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 వరకు మూసివేయాలని సూచించారు. నిషేధిత వస్తువులతో పరీక్ష కేంద్రాల వద్ద తిరగవద్దని
సూచించారు.