అక్షరటుడే, ఇందూరు: SC ST Commission | అట్రాసిటీ కేసుల్లో పురోగతి సాధించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య (Bakki venkataiah) పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna reddy), సీపీ సాయి చైతన్య (CP Sai chaitanaya), ఇతర అధికారులతో శనివారం భేటీ అయ్యారు.
ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. సబ్‌ప్లాన్ నిధులు, వివిధ శాఖల ద్వారా షెడ్యూల్డ్ కులాలు, తెగల వారి కోసం వెచ్చిస్తున్న నిధుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా సమస్యలపై బాధితుల నుంచి వినతిపత్రం స్వీకరించారు.
SC, ST Commission | కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి పరామర్శ..
సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ (CCS Constable Pramod) ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమోద్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. విధినిర్వహణలో హత్యకు గురికావడం ఎంతో బాధ కలిగించిందన్నారు. బాధిత కుటుంబానికి కమిషన్ అండగా నిలుస్తుందని, పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా చూస్తామని భరోసా కల్పించారు. ఆయన వెంట ఏసీపీ రాజా వెంకటరెడ్డి, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ అభివృద్ధి శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులు ఉన్నారు.


