అక్షరటుడే, ఇందూరు: Municipal Elections | స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియను ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో పక్కాగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) తెలిపారు. అర్బన్ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ అమలు తీరు, ముసాయిదా ఓటర్ జాబితాపై మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో (municipal corporation office) ఏఈఆర్వోలు, బీఎల్వో, సూపర్వైజర్లతో సమావేశం నిర్వహించారు.
Municipal Elections | పోలింగ్ కేంద్రాల వారీగా..
పోలింగ్ కేంద్రాల వారీగా ఎస్ఐఆర్ అమలును పరిశీలిస్తూ వెనుకంజలో ఉన్న వారి కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం (Election Commission) నియమ నిబంధనలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. అర్బన్ పరిధిలోని 301 పోలింగ్ కేంద్రాల పరిధిలో స్పష్టమైన ప్రగతి సాధించాల్సిందేనన్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రం వారీగా బీఎల్వోలతో మ్యాపింగ్‌ను పక్కాగా జరిపించాలని ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా నిశితంగా పరిశీలించాలన్నారు.
Municipal Elections | వారం రోజుల్లో సమీక్ష..
వారంలో మళ్లీ సమీక్ష నిర్వహిస్తారని, లోటుపాట్లను సరిదిద్దాలని కలెక్టర్ సూచించారు. ఓటరు జాబితా పూర్తి పారదర్శకంగా ఉండాలని ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగకుండా ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. జాబితాపై ఫిర్యాదులు వస్తే సంబంధిత బీఎల్వోలు, సూపర్వైజర్లను బాధ్యులుగా పరిగణిస్తామని హెచ్చరించారు. నూతనంగా విలీనమైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ , నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.