Homeబిజినెస్​IPO | రేపటి నుంచి మరో ఐపీవో.. లాభాలు ‘సంభవ్‌’మేనా?

IPO | రేపటి నుంచి మరో ఐపీవో.. లాభాలు ‘సంభవ్‌’మేనా?

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: IPO | ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ వెల్డెడ్ (ERW) స్టీల్ పైపులు, హాలో స్ట్రక్చరల్ ట్యూబ్‌ల ఉత్పత్తిదారు అయిన సంభవ్ స్టీల్ ట్యూబ్స్‌(Sambhv Steel Tubes) అనే మెయిన్‌ బోర్డు ఐపీవో రేపటి నుంచి ప్రారంభం కానుంది. వచ్చేనెల 2న ఈ కంపెనీ షేర్లు లిస్ట్‌ కానున్నాయి.


ఈ కంపెనీ ఫ్రెష్‌ ఇష్యూ(Fresh issue) ద్వారా రూ. 440 కోట్లను, ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా రూ. 100 కోట్లను సమీకరించనుంది. పబ్లిక్‌ ఇష్యూ(Public issue) ద్వారా సేకరించిన నిధులను రుణ భారాన్ని తగ్గించడానికి, వివిధ కార్పొరేట్ అవసరాలకు ఉపయోగించనున్నట్లు ప్రకటించింది.

IPO | ధరల శ్రేణి..

రూ. 10 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ. 77 నుంచి రూ. 82గా నిర్ణయించింది. లాట్ సైజు 182 ఈక్విటీ షేర్లు. ఆసక్తి గలవారు ఒక లాట్ కోసం రూ. 14,924 తో బిడ్ దాఖలు చేయాల్సి ఉంటుంది.

IPO | ముఖ్యమైన తేదీలు..

సబ్‌స్క్రిప్షన్‌(Subscription)లు బుధవారం ప్రారంభమై శుక్రవారంతో ముగియనుంది. 30వ తేదీన అలాట్‌మెంట్‌ స్టేటస్‌ ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ కంపెనీ షేర్లు వచ్చేనెల 2వ తేదీన ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో లిస్ట్‌ అవుతాయి.

IPO | కోటా..

ఐపీవో(IPO)లో 50 శాతం షేర్లను సంస్థాగత కొనుగోలుదారులకు (QIB) రిజర్వ్ చేసింది. 15 శాతం సంస్థాగతేతర పెట్టుబడిదారులకు (NII), 35 శాతం రిటైల్ పెట్టుబడిదారులకు కేటాయించింది.

IPO | జీఎంపీ..

ఈ కంపెనీ షేర్లు గ్రే మార్కెట్‌లో తొమ్మిది రూపాయల ప్రీమియం(Premium)తో ‍ట్రేడ్‌ అవుతున్నాయి. అంటే లిస్టింగ్‌ రోజున 11 శాతం వరకు లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.