Homeబిజినెస్​Stock Market | మూడో రోజూ లాభాల్లోనే..

Stock Market | మూడో రోజూ లాభాల్లోనే..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్‌(Domestic Stock Market)లో బుల్స్‌ ఆధిపత్యం కొనసాగుతోంది. వరుసగా మూడో రోజూ ప్రధాన సూచీలు లాభాలతో ముగిశాయి. బుధవారం ఉదయం సెన్సెక్స్‌ 126 పాయింట్లు, నిఫ్టీ(Nifty) 37 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమయ్యాయి.

సెన్సెక్స్‌ 82,490 నుంచి 82,741 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 25,275 నుంచి 25,346 పాయింట్ల మధ్యలో ట్రేడ్‌ అయ్యాయి. చివరికి సెన్సెక్స్‌(Sensex) 313 పాయింట్ల లాభంతో 82,693 వద్ద, నిఫ్టీ 91 పాయింట్ల లాభంతో 25,330 వద్ద్ద స్థిరపడ్డాయి.

పీఎస్‌యూ స్టాక్స్‌లో జోష్‌..

పీఎస్‌యూ, పీఎస్‌యూ బ్యాంక్‌(PSU bank) స్టాక్స్‌ దూసుకుపోయాయి. బీఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 2.55 శాతం పెరగ్గా.. పీఎస్‌యూ 1.27 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌ 0.96 శాతం, బ్యాంకెక్స్‌ 0.75 శాతం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ 0.69 శాతం, ఐటీ 0.67 శాతం, ఎనర్జీ 0.66 శాతం, ఆటో ఇండెక్స్‌ 0.52 శాతం లాభపడ్డాయి. మెటల్‌ ఇండెక్స్‌(Metal index) 0.49 శాతం, టెలికాం 0.42 శాతం, యుటిలిటీ ఇండెక్స్‌ 0.33 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.16 శాతం నష్టపోయాయి. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.51 శాతం, లార్జ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.32 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.19 శాతం పెరిగాయి.

అడ్వాన్సెస్‌ అండ్‌ డిక్లయిన్స్‌..

బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 2,408 కంపెనీలు లాభపడగా 1,746 స్టాక్స్‌ నష్టపోయాయి. 174 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 162 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 53 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 8 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 7 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.

Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 18 కంపెనీలు లాభాలతో ఉండగా.. 12 కంపెనీలు నష్టాలతో ముగిశాయి.
ఎస్‌బీఐ 3.02 శాతం, బీఈఎల్‌ 2.36 శాతం, కోటక్‌ బ్యాంక్‌ 1.43 శాతం, మారుతి 1.35 శాతం, ట్రెంట్‌ 1.21 శాతం లాభపడ్డాయి.

Top Losers : బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 0.99 శాతం, టైటాన్‌ 0.98 శాతం, ఐటీసీ 0.93 శాతం, టాటా స్టీల్‌ 0.44 శాతం, పవర్‌గ్రిడ్‌ 0.42 శాతం నష్టపోయాయి.