Homeబిజినెస్​Stock Market | నాలుగో రోజూ లాభాల్లోనే..

Stock Market | నాలుగో రోజూ లాభాల్లోనే..

Stock Market | స్టాక్‌ మార్కెట్లు వరుసగా నాలుగో సెషన్‌లోనూ లాభాలతో ముగిశాయి.ఇన్వెస్టర్లు ప్రాఫిట్‌ బుకింగ్‌కు దిగడంతో ఇంట్రాడే లాభాలు ఆవిరయ్యాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic Stock Markets) వరుసగా నాలుగో సెషన్‌లోనూ లాభాలతో ముగిశాయి. అయితే గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు ప్రాఫిట్‌ బుకింగ్‌(Profit booking)కు దిగడంతో ఇంట్రాడే లాభాలు ఆవిరయ్యాయి.

ప్రధానంగా బ్యాంకింగ్‌, మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. మంగళవారం ఉదయం సెన్సెక్స్‌ 93 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ(Nifty) 8 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. సూచీలు నిలకడగా పెరుగుతున్నాయి. సెన్సెక్స్‌(Sensex) 81,787 నుంచి 82,309 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 25,076 నుంచి 25,220 పాయింట్ల మధ్యలో సాగాయి. చివరికి సెన్సెక్స్‌ 136 పాయింట్ల లాభంతో 81,926 వద్ద, నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో 25,108 వద్ద స్థిరపడ్డాయి.

మిక్స్‌డ్‌గా సూచీలు : బీఎస్‌ఈలో టెలికాం(Telecom) ఇండెక్స్‌ 2.13 శాతం పెరగ్గా.. రియాలిటీ ఇండెక్స్‌ 1.09 శాతం, ఎనర్జీ 0.47 శాతం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఇండెక్స్‌ 0.47 శాతం, కన్జూమర్‌ డ్యూరెబుల్‌ 0.28 శాతం, ఆటో 0.26 శాతం, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 0.24 శాతం లాభపడ్డాయి. ఎఫ్‌ఎంసీజీ 0.49 శాతం, పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 0.31 శాతం, మెటల్‌ 0.29 శాతం, ఐటీ(IT) ఇండెక్స్‌ 0.19 శాతం నష్టపోయాయి. మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.45 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.14 శాతం పెరగ్గా.. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.15 శాతం నష్టపోయింది.

అడ్వాన్సెస్‌ అండ్‌ డిక్లయిన్స్‌ : బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 1,843 కంపెనీలు లాభపడగా 2,320 స్టాక్స్‌ నష్టపోయాయి. 159 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 175 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 130 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 7 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 6 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.

Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 14 కంపెనీలు లాభాలతో ఉండగా.. 16 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఎయిర్‌టెల్‌ 1.55 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.40 శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 0.99 శాతం, పవర్‌గ్రిడ్‌ 0.92 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.89 శాతం పెరిగాయి.

Top Losers : యాక్సిస్‌ బ్యాంక్‌ 2.13 శాతం, టాటామోటార్స్‌ 2.01 శాతం, ట్రెంట్‌ 1.78 శాతం, ఇన్ఫోసిస్‌ 1.29 శాతం, ఎస్‌బీఐ 1.07 శాతం నష్టపోయాయి.