Homeబిజినెస్​Stock Market | లార్జ్‌ క్యాప్‌లో ప్రాఫిట్‌ బుకింగ్‌.. నష్టాల్లో ప్రధాన సూచీలు

Stock Market | లార్జ్‌ క్యాప్‌లో ప్రాఫిట్‌ బుకింగ్‌.. నష్టాల్లో ప్రధాన సూచీలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Markets | దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic stock markets) మంగళవారం నష్టాలతో కొనసాగుతున్నాయి. సోమవారం మన మార్కెట్లు భారీ ర్యాలీ తీయడంతో ఈరోజు ప్రాఫిట్‌ బుకింగ్‌ జరుగుతోంది. దీంతో సూచీల్లో ఒత్తిడి కనిపిస్తోంది. మంగళవారం ఉదయం సెన్సెక్స్‌(Sensex) 180 పాయింట్ల స్వల్ప గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైంది. ఇంట్రాడేలో గరిష్టంగా 143 పాయింట్లు లాభపడింది. ఆ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ఇంటాడ్రే(Intraday) గరిష్టాలనుంచి 12 వందలకుపైగా పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 60 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా.. ఇంట్రాడేలో గరిష్టంగా 49 పాయింట్లు లాభపడింది. ఆ తర్వాత గరిష్టాలనుంచి 339 పాయింట్లు క్షీణించింది. మధ్యాహ్నం 12.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 1,083 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ(Nifty) 360 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి. లార్జ్‌ క్యాప్‌ స్టాక్స్‌ ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగాయి. సంస్థాగత మదుపరులు గరిష్టాల వద్ద లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలు పడిపోతున్నాయి.

Stock Markets | స్మాల్‌, మిడ్‌ క్యాప్‌లో ర్యాలీ..

పీఎస్‌యూ, స్మాల్‌ క్యాప్‌(Small cap), మిడ్‌ క్యాప్‌ షేర్లు రాణిస్తున్నాయి. ఐటీ, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, టెలికాం, మెటల్‌ రంగాలు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. బీఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1.91 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌ సూచీ 1.51 శాతం, హెల్త్‌ కేర్‌ సూచీ 1.23 శాతం పెరిగాయి. పీఎస్‌యూ(PSU) ఇండెక్స్‌ 0.7 శాతం లాభంతో ఉంది. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ ఒక శాతం లాభంతో, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.6 శాతం లాభంతో కొనసాగుతున్నాయి. లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.45 శాతం తగ్గింది. పవర్‌, ఇన్‌ఫ్రా ఇండెక్స్‌లు స్వల్ప లాభాలతో ఉండగా.. ఎనర్జీ(Energy) షేర్లు స్వల్ప నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. ఐటీ ఇండెక్స్‌ 1.36 శాతం పతనమైంది. బ్యాంకెక్స్‌, మెటల్‌, ఆటో, టెలికాం స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది.

Top Gainers..

బీఎస్‌ఈ(BSE) సెన్సెక్స్‌ 30 ఇండెక్స్‌లో 8 కంపెనీలు లాభాలతో సాగుతుండగా.. 22 కంపెనీలు నష్టాలతో ఉన్నాయి. అదాని పోర్ట్స్‌ 1.72 శాతం, బజాజ్‌ ఫైనాన్స్‌(Bajaj finance) 1.36 శాతం పెరిగాయి. టెక్‌ మహీంద్రా, సన్‌ ఫార్మా 0.9 శాతానికిపైగా లాభంతో కొనసాగుతున్నాయి.

Top Losers..

ఇన్ఫోసిస్‌(Infosys) 2.69 శాతం, ఎటర్నల్‌ 2.48 శాతం, పవర్‌గ్రిడ్‌ 2.17 శాతం క్షీణించాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐటీసీ(ITC), హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఆసియా పెయింట్‌, నెస్లే ఒక శాతానికిపైగా నష్టంతో కదలాడుతున్నాయి.

Must Read
Related News