అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Markets | టారిఫ్‌ల విషయంలో అనిశ్చితి(Tariff uncertainty) కొనసాగుతుండడం, ఎఫ్‌ఐఐ(FII)లు వరుసగా పెట్టుబడులు ఉపసంహరిస్తుండడంతో మార్కెట్లు గరిష్టాల వద్ద నిలదొక్కుకోలేకపోతున్నాయి. దీంతో ప్రారంభ లాభాలు ఆవిరవుతున్నాయి. సోమవారం సైతం ప్రారంభంలో భారీ లాభాల బాటలో పయనించిన ప్రధాన సూచీలు చివరికి నామమాత్రపు లాభాలతో ముగించాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు నూతన వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. అయితే ప్రారంభ లాభాలను నిలుపుకోలేకపోయాయి. సోమవారం ఉదయం సెన్సెక్స్ 194 పాయింట్లు, నిఫ్టీ(Nifty) 61 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. స్వల్ప ఒడిదుడుకులకు లోనవుతున్నా లాభాల బాటలోనే పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 80,733 నుంచి 81,171 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 24,751 నుంచి 24,885 పాయింట్ల మధ్యలో ట్రేడ్ అయ్యాయి. చివరికి సెన్సెక్స్(Sensex) 76 పాయింట్ల లాభంతో 80,787 వద్ద, నిఫ్టీ 32 పాయింట్ల లాభంతో 24,773 వద్ద స్థిరపడ్డాయి.
Stock Markets | ఆటో జోరు.. ఐటీ బేజారు..
జీఎస్టీ సంస్కరణలతో ఆటో రంగంలో జోరు కొనసాగింది. ఐటీ సెక్టార్ మాత్రం ఇంకా కోలుకోవడం లేదు. బీఎస్‌ఈలో ఆటో ఇండెక్స్(Auto index) 3.12 శాతం పెరగ్గా.. టెలికాం 0.71 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 0.49 శాతం, రియాలిటీ 0.44 శాతం, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 0.37 శాతం, మెటల్ ఇండెక్స్ 0.36 శాతం లాభంతో ముగిశాయి. ఐటీ ఇండెక్స్(IT index) 0.91 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 0.71 శాతం, ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్ 0.34 శాతం నష్టపోయాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.33 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.30 శాతం, లార్జ్‌క్యాప్ ఇండెక్స్ 0.18 శాతం పెరిగాయి.
Stock Markets | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 2,286 కంపెనీలు లాభపడగా 1,940 స్టాక్స్ నష్టపోయాయి. 181 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 168 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 69 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 15 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 6 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Stock Markets | Top gainers..
బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 14 కంపెనీలు లాభాలతో ఉండగా.. 16 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. టాటా మోటార్స్ 3.97 శాతం, ఎంఅండ్‌ఎం 3.96 శాతం, మారుతి 2.32 శాతం, అదానీ పోర్ట్స్ 2 శాతం, టాటా స్టీల్ 0.72 శాతం లాభపడ్డాయి.
Stock Markets | Top losers..
ట్రెంట్ 3.81 శాతం, ఆసియా పెయింట్ 1.90 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.21 శాతం, టెక్ మహీంద్రా 1.13 శాతం, ఎల్‌టీ 0.99 శాతం నష్టపోయాయి.