అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market | భారత్, యూఎస్‌ల మధ్య ట్రేడ్ డీల్ కుదురుతుందన్న సంకేతాలతో భారీ లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఇంట్రాడే (Intraday) లాభాలను నిలబెట్టుకోలేకపోయాయి. సూచీలు గరిష్టాల వద్ద దిద్దుబాటుకు గురయ్యాయి.
ముడి చమురు ధరలు పెరగడంతో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు (Profit booking) ప్రాధాన్యత ఇచ్చారు. అయినా వరుసగా ఆరో సెషన్‌లోనూ బెంచ్‌మార్క్ సూచీలు లాభాలతో ముగిశాయి. గురువారం ఉదయం సెన్సెక్స్ 728 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 189 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్(Sensex) 85,290 పాయింట్లకు చేరుకున్నా.. గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో ఒక దశలో 84,45 పాయింట్లకు తగ్గింది. నిఫ్టీ ఇంట్రాడేలో (Intraday) 26,104 స్థాయికి చేరుకున్న తర్వాత ప్రాఫిట్ బుకింగ్ కారణంగా 25,862కి పడిపోయింది. చివరికి సెన్సెక్స్ (Sensex) 130 పాయింట్ల లాభంతో 84,556 వద్ద, నిఫ్టీ 23 పాయింట్ల లాభంతో 25,891 వద్ద స్థిరపడ్డాయి. 58,577 వద్ద ఆల్‌టైం హైని తాకిన బ్యాంక్ నిఫ్టీ (Bank nifty).. అక్కడినుంచి 400లకుపైగా పాయింట్లు క్షీణించింది.
Stock Market | ఐటీలో జోరు..
బీఎస్‌ఈలో ఐటీ(IT) ఇండెక్స్ 2.36 శాతం పెరగ్గా.. బ్యాంకెక్స్ 0.36 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 0.23 శాతం, మెటల్ 0.16 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.14 శాతం పెరిగాయి. సర్వీసెస్(Services) 1.19 శాతం, టెలికాం 0.72 శాతం, ఎనర్జీ 0.54 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.48 శాతం, హెల్త్‌కేర్ 0.46 శాతం, కమోడిటీ 0.41 శాతం నష్టంతో ముగిశాయి. లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.05 శాతం పెరగ్గా.. స్మాల్ క్యాప్(Small cap) ఇండెక్స్ 0.42 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.15 శాతం నష్టపోయాయి.
Stock Market | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 1,855 కంపెనీలు లాభపడగా 2,409 స్టాక్స్ నష్టపోయాయి. 125 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 221 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 60 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 8 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 6 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Stock Market | Top gainers..
బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 22 కంపెనీలు లాభాలతో ఉండగా.. 8 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఇన్ఫోసిస్ 3.86 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 2.43 శాతం, టీసీఎస్ 2.24 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.90 శాతం, కొటక్ బ్యాంక్ 1.24 శాతం పెరిగాయి.
Stock Market | Top losers..
ఎటర్నల్ 2.88 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.75 శాతం, ఎయిర్‌టెల్ 1.63 శాతం, అదానిపోర్ట్స్ 1.41 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.35 శాతం నష్టపోయాయి.
