ePaper
More
    HomeతెలంగాణTelangana Rising Advisory Council | తెలంగాణ రైజింగ్ సలహా మండలి సలహాదారుగా అభిజిత్...

    Telangana Rising Advisory Council | తెలంగాణ రైజింగ్ సలహా మండలి సలహాదారుగా అభిజిత్ బెనర్జీ!

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Telangana Rising Advisory Council : తెలంగాణ రైజింగ్ సలహా మండలిలో సలహాదారుగా భాగస్వామ్యం కావడానికి ఆర్థిక శాస్త్ర నిపుణుడు, అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత ఆచార్య అభిజిత్ బెనర్జీ(Economist and Nobel Prize winner Abhijit Banerjee) అంగీకరించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy)తో ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

    ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగిన ఇరువురి భేటీలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, ప్రభుత్వం చేపట్టిన చర్యల వంటి అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(IT and Industries Minister Sridhar Babu)తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

    రాష్ట్రంలో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కల్పన అంశంపై చర్చించారు. సంప్రదాయ నైపుణ్యాల్లో ఆధునిక డిజైన్(modern design), మార్కెటింగ్(marketing), సోషల్ మీడియా సాంకేతిక(social media technology) వినియోగంలో విశిష్టత కలిగిన స్వల్పకాలిక కోర్సులను రూపొందించాల్సిన అవసరాన్ని ఆచార్య బెనర్జీ ప్రస్తావించారు.

    తద్వారా సంప్రదాయ కళాకారుల(traditional artists)ను ఆధునిక వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడంలో సహాయపడుతుందని బెనర్జీ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ఫ్యూచర్ సిటీ(Future City) అంశాల్లో క్రాఫ్ట్స్, ఆర్ట్స్, సృజనాత్మకత వంటివాటిని చేర్చాలన్నారు.

    ట్రాన్స్ జెండర్స్ ను పోలీసు, మున్సిపల్ శాఖల్లో నియమించడం, ఔట‌ర్ రింగ్ రోడ్డు(Outer Ring Road) లోపల ఉన్న హైద‌రాబాద్ కోర్ అర్బ‌న్ ఏరియాను సర్వీస్ సెక్టార్ గా అభివృద్ధి చేసే ప్ర‌ణాళికను ఎంచుకోవడం, స్కిల్ వ‌ర్సిటీ(skill university), స్పోర్ట్స్ వర్సిటీ(sports university) ఏర్పాటు వంటి ప్రభుత్వ ప్రణాళికలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికతకు అద్దం పడుతున్నాయని ఈ సందర్భంగా అభిజిత్ బెన‌ర్జీ పేర్కొన్నారు.

    శ‌తాబ్దాల చరిత్ర కలిగిన హైద‌రాబాద్ విజ‌న్ ను, ఇక్క‌డి ఉత్ప‌త్తులకు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఆదర‌ణ గురించి ముఖ్యమంత్రి వివరించారు. తెలంగాణ విశిష్టత, ఇక్కడి అనుకూల వాతావరణాన్ని ప్రపంచ దేశాల్లో చాటిచెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలో మ‌హిళా స్వ‌యం స‌హాయ‌క సంఘాలు(women’s self-help groups), రైతుల సాధికారత, యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు స్కిల్ డెవలప్​మెంట్​ దిశగా సర్కారు చేప‌డుతున్న విప్ల‌వాత్మ‌క చ‌ర్య‌లను సీఎం ప్రస్తావించారు.

    ఈ సమావేశంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె. రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్, ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

    Latest articles

    IBPS Clerk Notification | బ్యాంకుల్లో క్లర్క్‌ పోస్టులు.. భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఐబీపీఎస్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IBPS Clerk Notification | బ్యాంకింగ్‌ రంగం(Banking sector)లో ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూస్తున్నవారికి...

    Jenda Balaji Temple | 24 నుంచి జెండా జాతర ఉత్సవాలు

    అక్షరటుడే, ఇందూరు: Jenda Balaji Temple | నగరంలోని జెండా బాలాజీ ఆలయ జాతర ఉత్సవాలు (Flag Fair)...

    PM Modi | అమెరికా ప‌ర్య‌ట‌న‌కు ప్ర‌ధాని మోదీ.. టారిఫ్ బాదుడు త‌ర్వాత తొలిసారి యూఎస్‌కు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) అమెరికా ప‌ర్య‌ట‌న‌కు...

    Pakistan Spy | పాక్‌కు గూఢ‌చ‌ర్యం.. డీఆర్‌డీవో ఉద్యోగి అరెస్టు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pakistan Spy | పాకిస్తాన్‌కు గూఢ‌చ‌ర్యం చేస్తున్న డీఆర్‌డీవో ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు....

    More like this

    IBPS Clerk Notification | బ్యాంకుల్లో క్లర్క్‌ పోస్టులు.. భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఐబీపీఎస్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IBPS Clerk Notification | బ్యాంకింగ్‌ రంగం(Banking sector)లో ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూస్తున్నవారికి...

    Jenda Balaji Temple | 24 నుంచి జెండా జాతర ఉత్సవాలు

    అక్షరటుడే, ఇందూరు: Jenda Balaji Temple | నగరంలోని జెండా బాలాజీ ఆలయ జాతర ఉత్సవాలు (Flag Fair)...

    PM Modi | అమెరికా ప‌ర్య‌ట‌న‌కు ప్ర‌ధాని మోదీ.. టారిఫ్ బాదుడు త‌ర్వాత తొలిసారి యూఎస్‌కు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) అమెరికా ప‌ర్య‌ట‌న‌కు...