ePaper
More
    HomeజాతీయంOperation Sindoor | ‘ఆపరేషన్‌ సింధూర్‌’ సినిమా టైటిల్ కోసం పోటీ పడుతున్న నిర్మాణ సంస్థలు.....

    Operation Sindoor | ‘ఆపరేషన్‌ సింధూర్‌’ సినిమా టైటిల్ కోసం పోటీ పడుతున్న నిర్మాణ సంస్థలు.. ఎన్నో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Operation Sindoor | ఏప్రిల్‌ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్​గామ్‌లో ఉగ్రవాదులు Terrorists జరిపిన కాల్పుల్లో 26 మంది కన్నుమూయడంపై భార‌తీయులు(Indians) ఎంత ఆవేద‌న‌కి గుర‌య్యారో మ‌నం చూశాం. ఈ దాడితో యావత్‌ భారత దేశం కన్నీళ్లు పెట్టుకుంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ఈ ఉగ్రదాడికి బదులుతీర్చుకుంటామని.. ఉగ్రవాదులను, వారి వెనకున్న వారిని మట్టుబెడతామంటూ ప్రకటించారు. అయితే మే 6-7 మధ్య భారత త్రివిధ దళాలు సంయుక్తంగా ఆపరేషన్ సింధూర్‌(Operation Sindoor) చేపట్టి.. పాకిస్థాన్‌, పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు చేశాయి.

    Operation Sindoor | టైటిల్ కోసం పోటీ..

    ఈ దాడుల‌లో సుమారు వంద మంది ఉగ్ర‌వాదులు మ‌ర‌ణించారు. ఆపరేషన్‌ సింధూర్ Operation sindoor పేరుతో జ‌రిపిన ఈ ఆప‌రేష‌న్ సక్సెస్ అయింది. అలానే భార‌త సైన్యం(Indian Army)పై దేశ ప్రజలు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఇక ఆ పేరు స్ఫూర్తితో ఓ జంట తమ శిశువుకు ‘సింధూరి’(Sindoori) అని పేరు కూడా పెట్టుకుంది. సోషల్ మీడియాలో, బయట ఆపరేషన్‌ సింధూర్‌ అనే పేరు బాగా వైరల్ అయింది.. బాలీవుడ్​లో ఇలాంటి రియల్ ఇన్సిడెంట్స్ తో అనేక సినిమాలు వచ్చాయి. అందుకే ఇప్పుడు కొన్ని నిర్మాణ సంస్థలు ఆపరేషన్‌ సింధూర్‌ అనే టైటిల్ కోసం పోటీపడుతున్నారట. ఇప్ప‌టికే రిల‌య‌న్స్ అధినేత ముఖేష్ అంబానీ(Reliance chairman Mukesh Ambani) త‌న బిజినెస్‌లో భాగంగా ‘ఆపరేషన్ సింధూర్’ ట్రేడ్ మార్క్‌ను ద‌క్కించుకోవాల‌ని చూస్తున్న‌ట్టు తెలుస్తుంది.

    మ‌రోవైపు ‘ఆపరేషన్ సింధూర్’ అనే టైటిల్‌ను ద‌క్కించుకునేందుకు బాలీవుడ్‌కి చెందిన 15 అగ్ర నిర్మాణ సంస్థ‌లు ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IMPPA)ను ఆశ్రయించాయి. మహవీర్ జైన్ నిర్మాణ సంస్థ ఈ విషయంలో ముందుండగా, టి-సిరీస్, జీ స్టూడియోస్, మధుర్ భండార్కర్, అశోక్ పండిట్ Ashok Pandit వంటి ప్రముఖులు కూడా టైటిల్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు. గతంలో విడుదలైన సైనిక నేపథ్య చిత్రాల(ఉరి – ది సర్జికల్ స్ట్రైక్, ‘బోర్డర్’, ‘అమరన్’, ‘రాజీ’ ) విజయాన్ని దృష్టిలో ఉంచుకుని, “ఆపరేషన్ సింధూర్”(Operation Sindoor)కు బలమైన సినిమాటిక్ ఆకర్షణ ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. టైటిల్‌ను మొదట నమోదు చేసుకున్న వారికే దానిపై ఎక్కువ హక్కులు ఉంటాయని తెలుస్తోంది.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...