అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Kallugeeta Workers Union | కల్లుగీత కార్మికుల (Kallu Geetha workers) సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరమణ డిమాండ్ చేశారు. తాళ్ల కొత్తపేట గ్రామంలోని (Talla Kothapet village) ఎల్లమ్మగుడి ఫంక్షన్హాల్లో మూడో జిల్లా మహాసభలను ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమానికి రాష్ట్ర సలహాదారు పెద్ది వెంకట్రాములు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ.. 1957లో ఏర్పడిన సంఘం ఇప్పటివరకు ఎంతోమంది గీత కార్మికుల సమస్యలను పరిష్కరించిందన్నారు. కల్లుగీత కార్మికుల కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు ఇచ్చిందని.. కానీ ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. కార్మికులకు రూ.2000 పింఛన్‌ను రూ.4వేలకు పెంచుతామని.. కల్లుగీత కార్మికులు మృతి చెందితే ఎక్స్‌గ్రేషియా రూ.5లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచుతామని చెప్పి ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. సమస్యల పరిష్కారానికి భవిష్యత్ పోరాటం కోసం కల్లుగీత కార్మికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
