More
    Homeజిల్లాలుకామారెడ్డిBanswada | అంగన్​వాడీ కేంద్రాల్లో సమస్యలు పరిష్కరించాలి

    Banswada | అంగన్​వాడీ కేంద్రాల్లో సమస్యలు పరిష్కరించాలి

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | అంగన్​వాడీ కేంద్రాల్లో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ(CITU) జిల్లా ఉపాధ్యక్షుడు ఖలీల్ డిమాండ్​ చేశారు.

    బాన్సువాడ సబ్ కలెక్టర్​​ కార్యాలయం (Sub-Collectors Office) ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అంగన్​వాడీ కార్యకర్తలకు (Anganwadi workers) అన్నివిధాలుగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని.. తీరా అధికారంలోకి వచ్చాక పట్టించుకోవట్లేదన్నారు.

    Banswada | పదేళ్లుగా వంటపాత్రలు ఇవ్వలేదు..

    అంగన్​వాడీల్లో పదేళ్ల నుంచి వంటపాత్రలు కూడా ఇవ్వలేదని.. పక్కా భవనాలు, మరుగుదొడ్లు, నీటి సౌకర్యం లేదని వినతిపత్రంలో పేర్కొన్నారు. అంగన్​వాడీ పోస్టులు సైతం ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో అంగన్​వాడీ ప్రాజెక్ట్​ అధ్యక్షురాలు మహాదేవి, శివగంగ, సెక్టర్ లీడర్ రేణుక, గౌరమ్మ, శివ జ్యోతి, సవిత తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Karnataka CM | అగ్గి రాజేసిన కర్ణాటక సీఎం.. మత మార్పిళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు

    అక్షర టుడే, వెబ్‌డెస్క్: Karnataka CM | వివాదాస్పద వ్యాఖ్యలతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Karnataka CM Siddaramaiah)...

    Engineers’ Day | లయన్స్​ క్లబ్​ ఆఫ్​ ఇందూర్​ ఆధ్వర్యంలో ఇంజినీర్లకు సన్మానం

    అక్షరటుడే, ఇందూరు: Engineers' Day | నగరంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ (Lions Club of Indur)...

    Railway Passengers | రైల్వే ప్రయాణికులకు అలెర్ట్​.. టికెట్​ బుకింగ్​కు ఆధార్ అథెంటికేషన్‌ తప్పనిసరి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Passengers | రైల్వే బోర్డు (Railway Board) కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ల...